Ariyana Glory : నేను చిన్న పిల్ల‌ని అన్న అరియానా.. వ‌ర్క‌వుట్స్ మాత్ర‌మే తెలుసంటూ పంచ్ వేసిన రాజ్ త‌రుణ్‌

Ariyana Glory : యంగ్ హీరో రాజ్ తరుణ్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా సినిమాలో న‌టిస్తున్నారు .ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది.

Raj Tarun FUNNY Comments On Ariyana Glory
Raj Tarun FUNNY Comments On Ariyana Glory

అనుభవించు రాజా నవంబర్ 26న విడుదల కాబోతోంది. హీరోయిన్ కశిష్ ఖాన్ చిత్రంలో చాలా చ‌క్క‌గా క‌నిపించ‌నుంది. ఇది ఆమెకు మొద‌టి చిత్రం. ఈ సినిమా ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నాను. ఈ జర్నీ ఎంతో అద్భుతంగా ఉంది’ అని ఇటీవ‌ల పేర్కోన్నారు. ఇటీవ‌ల ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇందులో డైలాగ్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

రూపాయి పాపాయిలాంటిదిరా. దాన్ని పెంచి పెద్దచేసుకోవాలి కానీ.. ఎవరి చేతిలో పడితే వాడి చేతిలో పెట్టకూడదు’’ అనే మాటలతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. ‘‘బంగారంగాడి మనసు సినిమా హాలు లాంటిది. వారానికి ఒక సినిమా వస్తుంటుంది. పోతుంటుంది. ఏదీ పర్మినెంట్‌గా ఆడదు ఇక్కడ’’ అంటూ రాజ్‌ తరుణ్‌.. అరియానాతో చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి.

సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా అరియానా టీంని ఇంట‌ర్వ్యూ చేసింది. ఇందులో హీరోయిన్ ఇంగ్లీష్‌లో ప‌లు వ్యాఖ్య‌లు చేయ‌గా, దీనిని తెలుగులో చెబితే బాగుంటుంది క‌దా అని అరియానా అంది. దీనిపై అరియానా నాకేం తెలియ‌దు. నేను చిన్న పిల్ల‌ని అన‌గానే వెంట‌నే రాజ్ త‌రుణ్ అవును వ‌ర్క‌వుట్స్ మాత్ర‌మే తెలుసని అనే స‌రికి అరియానా దెబ్బ‌కు సైలెంట్ అయింది.

అరియానా, రామ్ గోపాల్ వర్మ అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తొచ్చేది ఒకే ఒక్క సీన్. అదే రామ్ గోపాల్ వర్మను అరియానా ఇంటర్వ్యూ చేస్తుండగా.. నేరుగా నిన్ను బికినీలో చూడాలని ఉందంటూ మనోడు ఓపెన్ కావడం. ఈ ఒక్క సీన్ అరియానా కెరీర్‌నే టర్న్ చేసిందని చెప్పుకోవచ్చు. అప్పటిదాకా కొందరికే తెలిసిన ఈ బ్యూటీ వర్మ కామెంట్ తర్వాత ఫుల్ పాపులర్ అయింది.

బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత రామ్ గోపాల్ వ‌ర్మ‌తో ఈ అమ్మ‌డు చేసిన ర‌చ్చ అంతా ఇంతాకాదు. వ‌ర్మ‌తో వ‌ర్క‌వుట్స్ చేస్తూ ఇంట‌ర్వ్యూ చేసింది అరియానా.ఈ విష‌యం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.