Raj Tarun : ఆ లేడీ యాంకర్ తో ఎఫైర్.. మొత్తానికి చెప్పేసిన రాజ్ తరుణ్..!
NQ Staff - March 21, 2023 / 05:42 PM IST

Raj Tarun : హీరోగా రాజ్ తరుణ్ కు ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఆయన కెరీర్ స్టార్టింగ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోయాడు. అప్పట్లో మంచి హిట్లు కూడా ఇండస్ట్రీకి ఇచ్చారు. కెరీర్ లో దాదాపు 52 షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ఆయన.. ఉయ్యాల జంపాల సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇందులో ఆయనకు ఉత్తమ నటుడిగా అవార్డు కూడా వచ్చింది.
కానీ ఇప్పుడు మాత్రం ఆయనకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ లో మాత్రమే నటించారు. అది తప్ప ఆయనకు మరో సినిమా లేదు. అయితే ఆయనపై గతంలో కొన్ని రూమర్లు కూడా వచ్చాయి. యాంకర్ లాస్యతో ఆయనకు ఎఫైర్ ఉందని.. వీరిద్దరూ త్వరలోనే పెండ్లి చేసుకుంటారంటూ రూమర్లు అప్పట్లో బాగా వచ్చాయి.
ఫోకస్ మొత్తం అక్కడే..
కానీ అప్పుడు ఎవరూ ఈ విషయంపై పెద్దగా స్పందించలేదు. కాగా తాజాగా ఇదే విషయంపై రాజ్ తరుణ్ స్పందించారు. తన ఫేస్ బుక్ లో దీనిపై పోస్టు పెట్టారు. నాకు యాంకర్ లాస్యకు ఏదో ఉందంటూ చాలామంది అంటున్నారు. కానీ నా ఫోకస్ మొత్తం కెరీర్ మీదనే ఉంది. మాకు ఎలాంటి సంబంధాలు లేవు.
అప్పుడెప్పుడో లాస్యను కలిశాను. మళ్లీ కలవలేదు. కనీసం టచ్ లో కూడా లేను. మా ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదంటూ కొట్టి పారేశారు రాజ్ తరుణ్. ఇక ఆయన పోస్టుకు మద్దతుగా చాలామంది కామెంట్లు పెడుతున్నారు. డోంట్ వర్రీ సార్.. హీరోగా మీరు మంచి పొజీషన్ లో ఉంటారు అంటూ చెప్పుకొస్తున్నారు.