Raj Kundra: సంచ‌ల‌న నిజాలు..ఒక్క నీలిచిత్రంతో శిల్పాశెట్టి భ‌ర్త ఎంత సంపాదించేవాడో తెలుసా?

Raj Kundra: బ‌డా బిజినెస్‌మెన్, శిల్పా శెట్టి భ‌ర్త రాజ్‌కుంద్రా అశ్లీల వీడియోలు తీసి యాప్స్ లో అప్ లోడ్ చేస్తున్నారన్న కారణంతో ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని జూలై 23 వరకు కోర్టు పోలీసు కస్టడీకి పంపింది. 45 ఏళ్ల కుంద్రాపై నమోదైన కేసు అశ్లీల వీడియోలు తీయడం.. కొన్ని యాప్ల ద్వారా పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

Raj Kundra

భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద రాజ్‌కుంద్రాపై కేసు న‌మోదు చేసి అత‌ని నుండి సంచ‌ల‌న విష‌యాలు రాబ‌డుతున్నారు పోలీసులు. ఈయ‌న వ్య‌వ‌హారం ముందు నుండి అనుమానంగానే ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు అధిపతిగా ముందుకు వచ్చిన రాజ్, ఆ తర్వాత బెట్టింగ్ ఆరోపణలతో ప‌ర‌వును దిగ‌జార్చుకున్నాడు..

తాజాగా వెస్ట్ ముంబయిలోని ఒక బిల్డింగ్ లో నీలి చిత్రాలు తీసే ఒక ముఠాను ముంబయి ప్రాపర్టీ సెల్ పోలీసులు అరెస్టు చేయగా ఆ ప్రొడక్షన్ హౌస్ మూలాలు యూకే కంపెనీవి అని గుర్తించారు. దానికి హెడ్ పేరు ఉమేశ్ కామత్ అని ఉంది. అతడు రాజ్ కుంద్రా బినామీగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీంతో రాజ్‌కుమార్‌ని అరెస్ట్ చేశారు. ఈ క్ర‌మంలో రాజ్ కుంద్రా బ్యాంక్ అకౌంట్ డీటైల్స్ కూడా ప‌రిశీలించ‌గా, అత‌డు రోజుకు లక్ష నుంచి పది లక్షలు సంపాదిస్తున్నట్లు తేలింది.

Raj Kundra

హాట్ హిట్ మూవీస్ సంస్థ నుంచి అతడి అకౌంట్లోకి ప్రతి రోజు లక్షల్లో లావాదేవీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకు ఖాతాలో లావాదేవీల వివరాలు పరిశీలిస్తే..

22 డిసెంబర్ 2020 న, XX790 ఖాతాలోకి హాట్‌హిట్ ఖాతా నుండి రూ .3 లక్షలు వచ్చాయి.

2020 డిసెంబర్ 25 న XX790 ఖాతాలోకి హాట్‌హిట్ ఖాతా నుండి లక్ష రూపాయలు వచ్చింది.

26 డిసెంబర్ 2020 న, XX790 ఖాతాలోకి హాట్‌హిట్ ఖాతా నుండి రూ .10 లక్షలు వచ్చాయి.

2020 డిసెంబర్ 28 న XX790 ఖాతాలో రూ .50 వేలు హాట్‌హిట్ ఖాతా నుండి వచ్చాయి.

జనవరి 3 న XX790 ఖాతాలోకి హాట్‌హిట్ ఖాతా నుండి 2 లక్షల 5 వేల రూపాయలు వచ్చాయి.

జనవరి 10 న XX790 ఖాతాలోకి హాట్‌హిట్ ఖాతా నుండి రూ .3 లక్షలు వచ్చాయి.

జనవరి 13 న XX790 ఖాతాలోకి హాట్‌హిట్ ఖాతా నుండి 2 లక్షల రూపాయలు వచ్చాయి.

జనవరి 20 న XX790 ఖాతాలోకి హాట్‌హిట్ ఖాతా నుండి లక్ష రూపాయలు వచ్చింది.

జనవరి 23 న, XX790 ఖాతాలోకి హాట్‌హిట్ ఖాతా నుండి 95 వేల రూపాయలు వచ్చాయి.

ఫిబ్రవరి 3 న XX790 ఖాతాలోకి హాట్‌హిట్ ఖాతా నుండి 2 లక్ష 70 వేల రూపాయలు వచ్చాయి.

రీసెంట్‌గా ఈ యాప్‌ని రాజ్ త‌న సోద‌రుడు ప్రదీప్ బక్షి యాజమాన్యంలోని యుకెకు చెందిన కెన్రిన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అమ్మినట్టు తెలుస్తుంది. ముంబై నుండి రాజ్ కుంద్రా కార్య‌కలాపాల‌ను చూస్తున్నార‌ట‌.