Arrest: నీలిచిత్రాలు తీస్తున్నాడంటూ టాప్ హీరోయిన్ భ‌ర్త అరెస్ట్‌..

Arrest: ప్ర‌ముఖ హీరోయిన్ శిల్పా శెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా త‌ర‌చు వివాదాల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంటారు. తాజాగా ఆయ‌నను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నీలిచిత్రాల చిత్రీకరణ, వాటిని కొన్ని యాప్స్ ద్వారా ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేసిన కేసులో అతనిని అదుపులోకి తీసుకున్నట్లు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. ఫిబ్రవరిలోనే ఈ వ్యవహారంలో రాజ్ కుంద్రాపై కేసు నమోదైంది.

Raj Kundra Arrest in Adult content Case
Raj Kundra Arrest in Adult content Case

ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా రాజ్‌ కుంద్రాను సోమవారం అరెస్ట్‌ చేసినట్లు ముంబై పోలీస్‌ కమిషనర్‌ హేమంత్‌ నగ్రాలె తెలిపారు. కుంద్రాకు వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యాధారాలున్నాయని, దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కుంద్రా జూన్‌లో ముంబై సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు.

మోడల్ షెర్లిన్ చోప్రా స్టేట్‌మెంట్ ఆధారంగా.. వెబ్ సిరీస్ పేరుతో అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలపై కుంద్రాకు సంబంధించిన ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్‌లో బెయిల్ మంజూరైంది.అయితే ఇదే కేసుకి సంబంధించి రాజ్‌కుంద్రాకు స‌మ‌న్లు జారీ చేశారు. ఆ స‌మ‌యంలో స్పందించిన కుంద్రా తాను స్టార‌ప్ నుండి వైదొలిగాన‌ని, కంపెనీకు నాకు ఎలాంటి సంబంధం లేద‌ని అన్నారు.

పోర్నోగ్ర‌ఫీకి సంబంధించి త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని కుంద్రా పోలీసుల‌కి తెలిపాడు. ఫిబ్రవరిలో ఇదే తరహా కేసులో ముంబై పోలీసులు నటి గెహనా వశిష్ట్‌తో పాటు మరికొందరిని పోర్న్ యాప్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వశిష్ట్ తన నగ్న వీడియోలను, పోర్నోగ్రఫిక్ కంటెంట్‌ను ఆమె వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిందనే కారణంగా గెహనా వశిష్ట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

నటీ నటులను బలవంతపెట్టి నగ్న చిత్రాలను చిత్రీకరించి, వాటిని పెయిడ్‌ మొబైల్‌ యాప్స్‌కు అమ్మే ముఠాకు సంబంధించి 9 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు.