Tollywood: చిరంజీవి సినిమాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాడు,ఇప్పుడు ఫేమ‌స్ అయ్యాడు

Tollywood: సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి రావ‌డం అంతా ఆశామాషీ కాదు. చిరంజీవి వంటి అద్భుత‌మైన టాలెంట్ ఉన్న‌ వ్య‌క్తికి అల్లు రామ‌లింగ‌య్య స‌పోర్ట్ ద‌క్క‌డంతో మెగాస్టార్‌గా ఎదిగారు.ఎన్నో క‌ష్టాల న‌డుమ చిరంజీవి ఈ స్థానం ద‌క్కింది. అయితే చిరంజీవి వ‌చ్చిన‌ప్పుడే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాడు ఇప్ప‌టి జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్. కాని జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షోతో ఈ క‌మెడీయ‌న్‌కి మంచి గుర్తింపు ద‌క్కింది. క‌డుపుబ్బ న‌వ్వించే క‌మెడీయ‌న్ జీవితంలో ఎన్నో విషాద సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. మ‌రి ఆ క‌మెడీయ‌న్ ఎవ‌రో కాదు రైజింగ్ రాజు.

హైపర్ ఆది టీంలోకి వ‌చ్చాక రాజు అనే వ్యక్తి ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడు అయ్యాడు. రైజింగ్ రాజుగా ప్రేక్ష‌కుల‌ని న‌వ్విస్తున్న ఆయ‌న గ‌త 40 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలోనే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే 42 ఏళ్ళ కింద ఇండస్ట్రీకి వచ్చాడు రాజు. కానీ ఈయన జీవితం మారడానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం వాసి అయిన రాజు తన జీవితంలో ఎన్నో క‌ష్టాల‌ని చ‌విచూసాడు. అవి వింటే ఆయ‌న అభిమానులు భావోద్వేగానికి త‌ప్ప‌క గుర‌వుతారు.

చాలా కాలం క్రిత‌మే ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన రాజుకి గుర్తింపు రావ‌డానికి 35 ఏళ్లు ప‌ట్టింది. 1979 లోనే నటుడు నూతన్ ప్రసాద్ ఒక సినిమా నిర్మించాడు. ఆ సినిమాకి రైజుంగ్ రాజు అన్నయ్య అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసాడు. అన్న‌య్య ద్వారా రాజు ఆ సినిమా ఆఫీసులో ఆఫీస్ బాయ్‌గా చేరాడు. అదే ఆఫీసులోనే క్యాషియర్‌గా పని చేస్తున్న నూతన్ ప్రసాద్ స్నేహితుడైన వేజెల్ల సత్యనారాయణతో పరిచయం ఏర్ప‌డింది.

ఆయ‌న త‌న ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా చేర‌మ‌ని చెప్ప‌డంతో రాజు అక్క‌డికి మారాడు. 1981లో మ‌లుపు అనే సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేశారు. అయితే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో తిరిగి త‌న ఊరెళ్లాడు. కొన్నేళ్ల త‌ర్వాత నవీన్ అనే స్నేహితుడు త‌న షార్ట్ ఫిలింస్‌లో న‌టించ‌మ‌ని కోర‌డంతో 30 నుండి 40 షార్ట్ ఫిలింస్‌లో న‌టించాడు.

ఇండ‌స్ట్రీలోకి రావ‌డానికి చాలా ఇబ్బందులు ప‌డ్డ రాజు అద్దె క‌ట్ట‌డానికి న‌రకం చూసాడు. ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే అత‌నికి జ‌బ‌ర్ధ‌స్త్ ఆఫ‌ర్ ఎలా వ‌చ్చింది అంటే ఒక సినిమా షూటింగ్ కోసం చ‌లాకీచంటి రామ‌చంద్రాపురం వెళ్ల‌డం, అక్క‌డ అత‌నికి రాజుని ప‌రిచ‌యం చేయ‌డం జ‌రిగింది. మొదట్లో చంటి టీంలోనూ ఆ తర్వాత సునామీ సుధాకర్ టీంలోనూ కొనసాగాడు.

ఇప్పుడు హైపర్ ఆది టీంలో కీల‌క వ్య‌క్తిగా మారిన రాజు ప్ర‌స్తుతం రైజింగ్ రాజుగా పిల‌వ‌బ‌డుతున్నాడు. ఇన్నేళ్ళ కష్టాలకు జబర్దస్త్ తనకు దారి చూపించింది ఈ క‌మెడీయ‌న్ అంటున్నాడు. అయితే ఈ మ‌ధ్య రాజు హైప‌ర్ ఆది టీంలో క‌నిపించ‌డం లేదు. కార‌ణాలు ఏంట‌నేది తెలియాల్సి ఉంది.