Rai laxmi: రాయ్ ల‌క్ష్మీ రెచ్చిపోయిందిగా.. అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తుందిగా..!

Rai laxmi: కెరీర్ ఆరంభంలో సంప్రదాయమైన పాత్రలతో డీసెంట్‌గా కనిపించిన అందాల ముద్దుగుమ్మ రాయ్ ల‌క్ష్మీ . ఎన్నో చిత్రాల్లో నటించిన కానీ, పెద్దగా గుర్తింపు లభించలేదు. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ నటించిన ‘కాంచనమాల కేబుల్ టీవీ’ అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కన్నడ బ్యూటీ రాయ్ లక్ష్మీ.

TheNewsQube-
rai laxmi beautiluf latest photoshoot3
rai laxmi beautiluf latest photoshoot3

తెలుగు సినిమాలకు దూరమైన తర్వాత.. తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో చాలా సినిమాలు చేసింది రాయ్ లక్ష్మీ. అన్ని చోట్లా పలు హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్‌గా మారింది. ఆ సమయంలోనే ‘అకీరా’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘జూలీ 2′ అనే సినిమా చేసి అందాలను ఆరబోసింది. దీంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది.

rai laxmi beautiluf latest photoshoot2
rai laxmi beautiluf latest photoshoot2

బాలకృష్ణ నటించిన ‘అధినాయకుడు’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది రాయ్ లక్ష్మీ. ఆ తర్వాత రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘బలుపు’ అనే సినిమాలో స్పెషల్ సాంగ్‌ చేసింది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే పవన్ కల్యాణ్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’, మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’లోనూ ఐటెం సాంగ్స్‌తో అదరగొట్టేసిందామె.

rai laxmi beautiluf latest photoshoot1
rai laxmi beautiluf latest photoshoot1

రాయ్ లక్ష్మీ సినిమా షూటింగ్‌లు ఉన్నా లేకున్నా చాలా రోజులుగా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో తన కెరీర్‌ గురించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.

rai laxmi beautiluf latest photoshoot
rai laxmi beautiluf latest photoshoot

రాయ్ లక్ష్మీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోల్లో ఎక్కువ శాతం గ్లామర్‌కు సంబంధించినవే ఉంటాయి. మరీ ముఖ్యంగా అందాల విందు చేస్తూ వదిలిన పిక్స్‌ చాలానే ఉన్నాయి. అందులోనూ బీచ్ దగ్గరో.. స్విమ్మింగ్ ఫూల్ సమీపంలోనే దిగిన బికినీ ఫొటోలనే ఆమె ఎక్కువగా పోస్టు చేస్తూ వస్తుంది. అందుకే రాయ్ లక్ష్మీకి బికినీ క్వీన్ అనే పేరును కూడా పెట్టేశారు కొందరు ఔత్సాహికులు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే అందాల‌తో కైపెక్కిస్తుంది. స్టైలిష్ డ్రెస్ లో తెగ రెచ్చిపోయి అందాలు ఆర‌బోసింది. రాయ్ ల‌క్ష్మీ గ్లామ‌ర్ షోకి యూత్ తెగ ఫిదా అవుతున్నారు.