Rahul Sipligunj : సీజ‌న్ 3విన్న‌ర్ హౌజ్‌లో ఎవరికి స‌పోర్ట్ చేస్తున్నాడంటే…!

Rahul Sipligunj : బిగ్ బాస్ సీజ‌న్ 5 తుది ద‌శ‌కు చేరుకుంటుంది. ఇంటి స‌భ్యులు ఒక్కొక్క‌రిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం హౌజ్‌లో 8 మంది మాత్ర‌మే ఉన్నారు. అయితే ఇందులో ఎవ‌రికి స‌పోర్ట్ చేస్తార‌ని రాహుల్ సిప్లిగంజ్‌ని ప్ర‌శ్నించ‌గా, ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ సీజన్‌లో అందరూ ఎవరి సత్తా వారు చూపిస్తున్నారన్నాడు.

TheNewsQube-
Rahul Sipligunj support to biggboss5 contestant
Rahul Sipligunj support to biggboss5 contestant

హౌస్‌లో మనుషులు తక్కువయ్యేకొద్దీ ఎవరు బెస్ట్‌ అని చెప్పడం కష్టమన్నాడు. తను షో చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నానని, కానీ ఎవరికీ సపోర్ట్‌ చేయడం లేదన్నాడు. బిగ్‌బాస్‌ షో మంచిగున్నా, మంచిగ లేకపోయినా చూస్తానని చెప్పుకొచ్చాడు. పక్కింట్లో పంచాయితీ జరిగిందంటే అందరికీ ఆసక్తే అని, ఆ ఆసక్తే షోను చూసేలా చేస్తుందని పేర్కొన్నాడు.

Rahul Sipligunj support to biggboss5 contestant
Rahul Sipligunj support to biggboss5 contestant

గతంలో తను పాల్గొన్న మూడో సీజన్‌కు మంచి టీఆర్పీ వచ్చిందని, కానీ తర్వాత వచ్చిన సీజన్లు ఎప్పటికప్పుడు టీఆర్పీని పెంచుకుంటూ పోతున్నాయన్నాడు. ఇటీవల రాహుల్ కాళ‌భైర‌వ క‌లిసి నాటు నాటు అనే పాట‌ని ఆర్ఆర్ఆర్ కోసం పాడ‌గా, ఇప్పటివరకు విడుదల చేసిన ఐదు భాషల్లో 40 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. అలాగే 2 మిలియన్లకు పైగా లైక్స్ సాధించడం విశేషం.

తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల కానుంది ‘ఆర్ఆర్ఆర్’.ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, నాటు నాటు అంచ‌నాలు భారీగా పెంచింది.

రాహుల్ సిప్లిగంజ్ తన తోటి కంటెస్టెంట్ అషు రెడ్డితో బాగా క్లోజ్‌గా కనిపించాడు. ఇద్దరూ కలిసి పార్టీల్లో ఎంజాయ్ చేస్తూ రొమాన్స్ చేస్తున్నట్టుగా కూడా కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ టాక్ వచ్చింది.