Rahul Sipligunj : పునర్నవి ప్రెగ్నెంటా.. ఛీ..ఛీ.. రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ..!

NQ Staff - April 6, 2023 / 09:46 AM IST

Rahul Sipligunj : పునర్నవి ప్రెగ్నెంటా.. ఛీ..ఛీ.. రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ..!

Rahul Sipligunj : బిగ్ బాస్ తో చాలామంది ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్లలో మూడో సీజన్ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఎక్కువగా ఫేమస్ అయింది మాత్రం రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం. ఇద్దరూ హౌస్ లో ఉన్నన్ని రోజులు రాసుకుని, పూసుకుని తిరిగారు. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెండ్లి చేసుకుంటారని చాలా రకాల రూమర్లు వచ్చాయి.

బిగ్ బాస్ తర్వాత కూడా ఇద్దరూ బయట చాలా షోలకు హాజరయ్యారు. ఆ తర్వాత పునర్నవి లండన్ వెళ్లిపోయింది. రాహుల్ మాత్రం ఇక్కడే ఉంటూ పాటలు పాడుకుంటున్నాడు. అలాగే కొన్ని బిజినెస్ లు కూడా చేసుకుంటున్నాడు. ఇక గత కొంత కాలంగా అషురెడ్డితో కూడా డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్.. ఈ ప్రశ్నలన్నింటిపై స్పందించాడు. పునర్నవితో డేటింగ్ చేస్తున్నారా అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చాడు. పునర్నవి నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. ఆమెతో ఎప్పటికీ అలాగే ఉంటాను. ఈ మధ్య ఆమె ప్రెగ్నెంట్ అంటూ నేను కారణమేమో అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఛీ..ఛీ.. అసలు నేను కారణం ఏంటి. అసలు ఆమె ప్రెగ్నెంట్ ఏంటి అలా ఏమీ జరిగి ఉండదు. ఇక అషురెడ్డితో కూడా నేను డేటింగ్ చేయట్లేదు. ఆమె నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. ఆమె ఎంతో మందికి సాయం చేస్తుంది. నాకు కూడా చేసింది. అంతే తప్ప వారితో నాకు ఎలాంటి సంబంధాలు లేవు అంటూ తెలిపాడు రాహుల్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us