Oscars : ఆస్కార్ ఈవెంట్‌ లో రాహుల్ సిప్లిగంజ్ లైవ్‌ పర్ఫార్మెన్స్‌..!

NQ Staff - March 1, 2023 / 10:35 AM IST

Oscars : ఆస్కార్ ఈవెంట్‌ లో రాహుల్ సిప్లిగంజ్ లైవ్‌ పర్ఫార్మెన్స్‌..!

Oscars : గత కొన్ని రోజులుగా త్రిబుల్‌ ఆర్ మూవీకి సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది. ఆ మూవీ ఇప్పటికే ఈ మూవీకి ఎన్నో అవార్డులు సొంతం అవుతున్నాయి. రీసెంట్ గానే నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్‌ అవార్డు కూడా వచ్చింది. దాంతో పాటు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్‌ కూడా ఐదు అవార్డులను ప్రధానం చేసింది.

ఇక నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్‌ లో కూడా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్కార్ ఈవెంట్స్‌ కు సంబంధించిన అదరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది. ఆస్కార్ 95 వ నామినేషన్స్‌ సందర్భంగా మార్చి 12న జరగబోయే ఈవెంట్ లో రాహుల్ సిప్లిగంజ్‌, కాల భైరవ లైవ్‌ ప్రోగ్రామ్ ఉండబోతోంది.

ఈ విషయమే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. మన తెలుగు వారికి ఒక హాలీవుడ్ వేదిక మీద లైవ్‌ ప్రోగ్రామ్ ఇచ్చే ఛాన్స్ రావడం అంటే మాటలు కాదనే చెప్పుకోవాలి. ఇక ఇందుకు సం బంధించిన న్యూస్‌ తో అందరూ త్రిబుల్‌ ఆర్‌ టీమ్‌ కు కంగ్రాట్స్‌ చెబుతున్నారు.

Rahul Sipligunj And Kaala Bhairava Doing Live Program During Oscars Nomination

Rahul Sipligunj And Kaala Bhairava Doing Live Program During Oscars Nomination

ఇదంతా జక్కన్న పడ్డ కష్టానికి ప్రతిఫలం అని చెబుతున్నారు. ఆస్కార్ అవార్డు కూడా వస్తే బాగుండు అని చాలా మంది భావిస్తున్నారు. చూడాలి మరి అందరూ ఆశిస్తున్నట్టు నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వస్తుందో లేదో.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us