Rahul Ravindran: ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫొటోల‌కు ఫోజిచ్చిన న‌టుడు

Rahul Ravindran: అందాల రాక్ష‌సి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి దగ్గ‌రైన న‌టుడు రాహుల్ ర‌వీంద్ర‌న్‌. హీరోగా స‌త్తా చాటిన రాను రాను అతినికి పెద్ద‌గా గుర్తింపు లేకుండా పోయింది. దీంతో ద‌ర్శ‌కుడిగా మారాడు. మొదటి సారిగా చిలసౌ సినిమాతో రాహుల్ రవీంద్రన్ దర్శకుడి అవ‌తారం ఎత్తాడు. తొలి చిత్రమే మంచి సక్సెస్ సాధించడంతో పెద్ద హీరోల దృష్టిలో పడ్దారు. కింగ్ నాగార్జునను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశారు.

Rahul Ravindran Shares his Childhood Pic
Rahul Ravindran Shares his Childhood Pic

నాగార్జున హీరోగా రాహుల్ మ‌న్మ‌థుడు 2 చిత్రం తెర‌కెక్కించ‌గా, ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. దీంతో ఆయ‌న కెరీర్ మ‌ళ్లీ డ‌ల్ అయింది. ప్ర‌స్తుతం రాహుల్ చేతిలో ప్రాజెక్టులు కూడా ఏమి లేన‌ట్టు తెలుస్తుంది. అయితే సినిమాలు లేక‌పోయిన సోష‌ల్ మీడియాలో మాత్రం ఆయ‌న పేరు మార్మోగిపోతూనే ఉంటుంది.

రాహుల్ భార్య చిన్మయి డబ్బింగ్ ఆర్టిస్ట్ క‌మ్ సింగ‌ర్. ఈమె లైంగిక వేధింపుల‌పై పోరాడుతూ ఉంటున్న విష‌యం తెలిసిందే. అయితే కొన్ని సార్లు చిన్మ‌యిని ట్రోల్ చేస్తుండ‌గా, అప్పుడు రాహుల్ పేరు కూడా వివాదంలో చేరుతుంది. ఈ మ‌ధ్య రాహుల్ ఓ వివాహ వేడుక ఫోటో షేర్ చేయ‌గా, అందులో చిన్మ‌యి పొట్ట కాస్త ఉబ్బెత్తుగా క‌నిపించింది. అంద‌రు చిన్మ‌యి ప్రెగ్నెంట్ అని ప్ర‌చారం చేశారు.

Rahul Ravindran Shares his Childhood Pic
Rahul Ravindran Shares his Childhood Pic

ఈ విష‌యం చిన్మయి ద‌గ్గ‌ర‌కు రావ‌డంతో దీనిపై స్పందించింది.మా సంప్ర‌దాయం ప్ర‌కారం చీర క‌ట్ట‌డం వ‌ల‌న పొట్ట ఎత్తుగా క‌నిపిస్తుంది తప్ప నేను గ‌ర్భ‌వ‌తిని కాదు అని వివ‌ర‌ణ ఇచ్చింది చిన్మ‌యి. మొత్తానికి రాహుల్ షేర్ చేసిన ఫొటోలు ఆమెకు లేని పోనితిప్ప‌లు తెచ్చిపెట్టాయి.

రాహుల్ చాలా కూల్ అండ్ కామ్. ఎవ‌రిని ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ‌తాడు. త‌న భార్య చిన్మయికి చాలా స‌పోర్ట్‌గా ఉంటాడు. పైగా చేసేది కరెక్ట్ అంటూ ఆమెకు తోడుగా ఉంటారు. అలాంటి రాహుల్ తాజాగా ఓ ఫోటో షేర్ చేశారు. నగ్న ఫోటోను షేర్ చేస్తూ ఇదే నా కెరీర్‌లో బోల్డెస్ట్ ఫోటో షూట్ అంటూ చిన్నతనంలో దిగిన ఫోటోను షేర్ చేశారు.

రాహుల్ బాల్యంలో ఇలా దిగంబ‌రుడిగా ఫొటో తీయించుకోవ‌డం ప‌ట్ల నెటిజ‌న్స్ ప‌లు కామెంట్స్ చేస్తున్నారు. భ‌లే స‌ర‌దాగా ఉన్నావు అంటూ రాహుల్ చిన్న‌నాటి ఫొటో చూసి మురిసిపోతున్నారు ఆయ‌న అభిమానులు. ఏదేమైన రాహుల్ న‌గ్న ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.