Rahul Ramakrishna Comments On Priyadarshi : ప్రియదర్శి గాడితో నన్ను పోల్చకండి.. ఇది అవమానమే.. రాహుల్ రామకృష్ణ కామెంట్లు..!

NQ Staff - July 18, 2023 / 11:28 AM IST

Rahul Ramakrishna Comments On Priyadarshi : ప్రియదర్శి గాడితో నన్ను పోల్చకండి.. ఇది అవమానమే.. రాహుల్ రామకృష్ణ కామెంట్లు..!

Rahul Ramakrishna Comments On Priyadarshi :

నటుడిగా రాహుల్ రామకృష్ణకు మంచి పేరుంది. ఆయన చిన్న నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఏకంగాహీరోరగా చేసే స్థాయికి ఎదిగిపోయాడు. ఇప్పటి జనరేషన్ కు స్టార్ కమెడియన్ గా అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్నాడు ఆయన. కాకపోతే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టులతో కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటాడు.

ఒకసారి నటన మానేస్తున్నా అంటాడు. ఒకసారి జోక్ చేశా అంటాడు. ఇంకోసారి నేను చిన్నప్పుడే రేప్ కు గురయ్యానని చెబతుంటాడు. ఇలా తిక్క తిక్క పోస్టులు పెడుతాడు. ఇక తాజాగా ఓ నెటిజన్ ఓ పోస్టు చేశాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇద్దరూ బలగం, ఇంటింటి రామాయణం సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.

అది కరెక్ట్ కాదు..

Rahul Ramakrishna Comments On Priyadarshi

Rahul Ramakrishna Comments On Priyadarshi

ఇద్దురూ నటన పరంగా దూసుకుపోతున్నారు అంటూ పోస్టు పెట్టాడు. దానికి రాహుల్ స్పందిస్తూ.. ఇది నిజంగా కరెక్ట్ కాదు. ప్రియదర్శి నాకంటే గొప్ప నటుడు. కష్టపడే తత్వం కలిగిన వ్యక్తి. అతనితో నన్ను పోల్చడం నేను ఒప్పుకోను. నాతో పోల్చడం అతనికి అవమానమే అంటూ సంచలన రిప్లై చేశాడు.

ఒక రకంగా ఇది పొగిడాడో లేక సెటైర్ వేశాడో అస్సలు అర్థం కావట్లేదు. ఇలా అర్థం కాని పోస్టులు పెట్టడం రాహుల్ కు కామన్ అయిపోయింది. గతంలో అనేక సార్లు ఇలాంటి పోస్టులు పెట్టాడు ఈయన. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ ఆర్టిస్ట్.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us