Raghavendra Rao: రాఘ‌వేంద్రరావు స‌ర‌స‌న సీనియ‌ర్ న‌టి.. ఇది ఎలాంటి ప్ర‌యోగమో మ‌రి..!

Raghavendra Rao: శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు చేయ‌ని ప్ర‌యోగం లేదు. అప్ప‌టి స్టార్ హీరోలంద‌రితో వైవిధ్య‌మైన సినిమాలు తీసి ప్రేక్ష‌కుల‌ని మెప్పించారు. హీరోయిన్ బొడ్డు మీద ఆపిల్ తో కొట్టడం.. హీరోతో రివెంజ్ డ్రామా నడిపించడం, యాక్షన్ సన్నివేశాలు రక్తి కట్టించడం, భ‌క్తిర‌స పాత్ర‌ల‌లో ప్రేక్ష‌కుల‌ని మెప్పించ‌డం వంటివి చేశారు. కెమెరా వెన‌క ఉండి ఆడియ‌న్స్‌ని ఎంత‌గానో అల‌రించిన రాఘ‌వేంద్ర‌రావు ఇప్పుడు కెమెరా ముందు న‌టించేందుకు సిద్ధ‌మ‌య్యారు. తన కవిత్వంతో చమత్కరించే తనికెళ్ల భరణి డైరెక్షన్‌లో రాఘ‌వేంద్ర‌రావు న‌టించ‌బోతున్నారు.

Raghavendra Rao

రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో త‌నికెళ్ల భ‌ర‌ణి చేయ‌నున్న సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వర్క్ దాదాపు పూర్తైంది. మొన్నటితరం ప్రేక్షకులతో పాటు నేటితరం ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా తనికెళ్ల భరణి కథ రెడీ చేశారట. ఇందులో రాఘవేంద్ర‌రావు స‌తీమ‌ణిగా సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మీని ఎంపిక చేశార‌ట త‌నికెళ్ల‌. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే లక్ష్మి.. త‌నికెళ్ల భ‌ర‌ణి తెర‌కెక్కించిన‌ మిథునంలో ఎస్పీ బాలు పక్కన నటించారు.ఇప్పుడు మ‌ళ్లీ త‌న సినిమాకు ఆమెనే ఎంపిక చేశారు. రాఘ‌వేంద్ర‌ర‌రావు, ల‌క్ష్మీ కాంబినేష‌న్‌లోని సీన్స్ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తాయ‌ని అంటున్నారు త‌నికెళ్ల‌.

Raghavendra Rao

లక్ష్మీ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఓ బేబి సినిమాలో అదిరిపోయే ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. అనేక చిత్రాల‌లో కూడా ల‌క్ష్మీ వైవిధ్య‌మైన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టింది. అందుకే రాఘవేంద్రుడి పక్కన లక్ష్మి అయితే బెటర్ అని భావించి ఆమెనే ఫైనల్ చేశారట తనికెళ్ల భరణి. చిత్రంలో రాఘ‌వేంద్ర రావు రిటైర్డ్ ఉద్యోగి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టుస స‌మాచారం. ఇందులో శ్రియ గెస్ట్ రోల్ లో క‌నిపించ‌నున్న‌ట్టు ఓ టాక్ న‌డుస్తుంది. అతి త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది. లాక్డౌన్ పూర్త‌య్యాక మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు. మరోవైపు రాఘవేంద్ర రావు తన ప‌ర్య‌వేక్ష‌ణ‌లో పెళ్లి సందD సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.