Radhika Apte : న‌గ్నంగా న‌టించ‌డం త‌ప్పు కాదు, సెక్స్ కోస‌మే నేను ఇండ‌స్ట్రీకి రాలేదు: రాధికా

Radhika Apte : బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల చిత్రాల్లో న‌టించి మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు రాధికా ఆప్టే. రజినీ, సూర్య, బాలయ్య వంటి స్టార్ హీరోల చిత్రాల్లో రాధికా ఆప్టే నటించారు. రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర సినిమాతో రాధికా ఆప్టేకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక బాలయ్య నటించిన లెజెండ్ సినిమాలో కనిపించిన రాధికా ఆప్టే అందరినీ ఆకట్టుకున్నారు.

Radhika Apte about bold scenes and movies
Radhika Apte about bold scenes and movies

రాధికా ఆప్టే అంటే కేవ‌లం న‌టిగా మాత్ర‌మే కాదు.. ఎప్ప‌టిక‌ప్పుడు కాంట్రవ‌ర్సీల్లో నిలిచే పేరుగా కూడా గుర్తుకొస్తుంది. ఈమె ప్ర‌స్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో కూడా అప్పుడప్పుడూ అవకాశాలు వస్తున్నా కూడా గతంలో మాదిరి దూకుడు చూపించట్లేదు ఈ ముద్దుగుమ్మ.

బద్లాపూర్, అహల్య, లస్ట్ స్టోరీస్, వెడ్డింగ్ గెస్ట్ లాంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నగ్నంగా కూడా నటించి సంచలనం సృష్టించింది రాధిక. ఈ మధ్యే ఇదే విషయంపై ఆమె ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ఓ దర్శకుడు ఈ మధ్యే తన దగ్గరికి కథ చెప్పడానికి వచ్చాడని.. అందులో తనది వేశ్య పాత్ర అని చెప్పినట్లు గుర్తు చేసుకుంది రాధిక.

ఎందుకు ఇలాంటి పాత్ర చెప్తున్నావని ప్ర‌శ్నించ‌గా, మీరు నటించిన బద్లాపూర్, అహల్య లాంటి సినిమాల్లో ఎలాగూ సెక్స్ సీన్స్‌తో పాటు నగ్నంగా కూడా నటించారు కదా.. ఇందులో కూడా అలాంటి పాత్రే చేస్తారేమో అని వచ్చినట్లు చెప్పాడని తెలిపింది రాధిక. దర్శకుడి జవాబు విన్న తర్వాత తాను షాక్ అయ్యానని చెప్పింది.

ఇండియ‌న్ సినిమాల్లోనే కాదు.. బ‌య‌టి సినిమాల్లో కూడా న‌గ్నంగా న‌టించ‌డం అనేది త‌ప్పేం కాదు.. సీన్ డిమాండ్ చేసిన‌పుడు అలా న‌టించ‌డం త‌ప్పేం కాద‌ని చెబుతుంది ఈ భామ‌. కానీ ఏ కథ పడితే ఆ కథ తీసుకొచ్చి న్యూడ్‌గా నటించమంటే ఎలా అంటుంది రాధిక. కేవలం సెక్స్ చేయడానికి మాత్రమే తాను ఇండస్ట్రీకి రాలేదు కదా అంటుంది.

కథ నచ్చితే ఎంత దూరం అయినా వెళ్తాను కానీ కథ లేకుండా కేవలం స్క్రీన్‌పై నగ్నంగా నటించమంటే మాత్రం నో ఛాన్స్ అంటుంది రాధిక. ఇప్పటి వరకు తాను చేసిన సినిమాలన్నీ తన మనసుకు నచ్చి చేసినవే అంటుంది ఈ భామ. తన శరీరంపై పూర్తి హక్కులు తనకు మాత్రమే ఉన్నాయని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ.