Radheshyam : రాధే శ్యామ్ స్టోరీ ఇలా లీక్ చేశాడేంటి.. ఆశ్చ‌ర్యంలో అభిమానులు…!

Radheshyam : ‘సాహో’ తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమాపైఅందరిలోనూ ఆసక్తి ఉంది. దీనికి తోడు వరుస హిట్లతో ఉన్న పూజ హెగ్డే నుంచి కొత్త ఏడాదిలో వస్తున్న మొదటి భారీ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో కృష్ణంరాజు కనిపించనున్నారని తెలుస్తోంది.

radheshyam movie ee rathale song
radheshyam movie ee rathale song

ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఆ మధ్య ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. రాధే శ్యామ్ టీజర్ అభిమానులందరినీ ఉర్రూతలూగించిందనే చెప్పోచ్చు. అద్భుతమైన విజువల్స్, విక్రమాదిత్యగా ప్రభాస్ లుక్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. రాధే శ్యామ్ తెలుగు టీజర్ టాలీవుడ్లో ఉన్న అన్ని రికార్డులను చెరిపివేసింది.

radheshyam movie ee rathale song
radheshyam movie ee rathale song

ఈ టీజర్ విడుదలైన కేవలం 20 గంటల్లోనే, యూట్యూబ్‌లో 35 మిలియన్ ప్లస్ వ్యూస్‌ని సాధించింది. టీజర్‌కు కూడా అర మిలియన్‌కు పైగా లైక్స్‌ వచ్చాయి. ఇక ఈ టీజర్‌లో ప్రభాస్ చేసిన విక్రమ్ ఆదిత్య పాత్రను పరిచయం చేశారు. ప్రభాస్ పాత్రను ఓ లెవల్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ మనుషుల భవిష్యత్తు చెప్పే వాడిగా కనిపించనున్నారని తెలుస్తోంది.

ఇక ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా నుంచి వచ్చిన ఈ రాతలే పాట ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంది. అలాంటి పాట ఈ మధ్య కాలంలో రాలేదని శ్రోతలు పదే పదే వింటూనే ఉన్నారు. పాటలోని లిరిక్స్, ట్యూన్, గాయనీగాయకుల గాత్రం ఇలా ప్రతీ ఒక్కటీ అందరినీ ఆకట్టుకుంది. ఈ పాట గురించి ర‌చ‌యిత కృష్ణ‌కాంత్ స్పందిస్తూ.. ఎక్కడ విన్నా ఇప్పుడు ఈ పాటే వినిపిస్తోంది. ఈ పాటను జస్టిన్ గారు ట్యూన్ ఇచ్చారు.

యువన్ శంకర్ రాజా, హరిణ పాడారు. ఇది ఒక క్లిష్టమైన సందర్భంలో వచ్చే పాట. అందుకే ఏదీ కూడా పూర్తిగా రివీల్ చేయలేదు. ఇది 70వ దశకంలో యూరోప్‌లో జరిగే ప్రేమ కథ. అందుకే ఇంగ్లీష్ పదాలు ఎక్కడా వాడకుండా కొంచెం పొయెట్రీ రాశాం.. ఇప్పటి ఆడియెన్స్‌కు ఇది ఎక్కుతుందా? అర్థమవుతుందా? అని అనుకున్నాం. కానీ ఒక్కసారి పాట విడుదలయ్యాక.. లిరికల్ వీడియోగ్రాఫిక్స్ చూసి జనాలందరికీ నచ్చింది.

అయితే మొదటి సారి వింటే అర్థం కావడం లేదు.. స్లో పాయిజన్‌లా ఎక్కేస్తోంది అని అంటున్నారు. లూప్ మోడ్‌లో పెట్టి వింటున్నామని చెబుతుంటే ఆనందంగా ఉంద’ని లిరిసిస్ట్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కానీ ఆ ఆనందంలో 70వ దశకంలో జరిగే ప్రేమ కథ అని గుట్టు విప్పేశాడు. అందుకే ఇండియాలోని ఎమర్జెన్సీకి సంబంధించిన విషయాన్ని కూడా ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో చూపించారు అని చెప్పుకొచ్చాడు.