RADHE SHYAM: రాధే శ్యామ్ కథ లీక్.. షాక్ లో ప్ర‌భాస్ ఫ్యాన్స్

ఎంత పెద్ద హీరో సినిమాకైనా కూడా ఇప్పుడు లీకేజ్ అనేది తీరని సమస్యగా మారిపోయింది. ఎప్పుడు ఎలాంటి లీకులు వస్తాయో అని అంతా భయపడుతున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఈ లీకుల బెడద ఆగడం లేదు. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు కూడా ఇదే జరిగింది. తాజాగా ఈయన నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమా గురించి అన్ని ఇండస్ట్రీలు చర్చించుకుంటున్నాయి. 140 కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా రాధే శ్యామ్ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. అయితే ఇప్పుడు కరోనా కారణంగా వాయిదా పడింది.

ప్రభాస్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్.. ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్ర కథ లీక్ అయింది. మెయిన్ థీమ్ బయటికి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ స్టోరీ బాగా వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే మెడికోగా నటిస్తుంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ కథ ఇది. 1960ల నేపథ్యంలో కథ సాగుతుంది. ఓ హాస్పిటల్ లో పూజా హెగ్డే పని చేస్తున్నప్పుడు అనుకోని ప్రమాదానికి గురైన ప్రభాస్ ను అదే ఆసుపత్రికి తరలిస్తారు.

అక్కడ ఆమె సేవలు చూసి ప్రేమలో పడిపోతాడు ప్రభాస్. అక్కడ్నుంచి ఆమెను తన ప్రేమలో ఎలా పడేసుకున్నాడు అనేది అసలు కథ. ప్రభాస్, పూజా హెగ్డే మధ్య వచ్చే సన్నివేశాలను చాలా అద్భుతంగా దర్శకుడు రాసుకున్నాడని తెలుస్తుంది. తొలి చూపులోనే ప్రేమలో పడిన ప్రభాస్… ప్రేరణను ఎలా దక్కించుకున్నాడు అనేది తెరపైనే చూడాలి. వినడానికి సింపుల్ గానే అనిపిస్తు్ననా కూడా స్క్రీన్ ప్లేతో మాయ చేయడానికి చూస్తున్నాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ఏదేమైనా కూడా మెయిన్ పాయింట్ లీక్ అయ్యేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

Advertisement