Radhe shyam : రాధే శ్యామ్ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలవబోతోంది..జస్టిన్ ప్రభాకరన్ అలా ప్లాన్ చేశాడట..!

Radhe shyam : రాధే శ్యామ్ డార్లింగ్ ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా సెన్షేషన్ ని క్రియేట్ చేయబోతోందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ రొమాంటిక్ పీరియాడికల్ లవ్ స్టోరీకి రాధకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రభాస్ కేరీర్ లో 20 వ సినిమా గా తెరకెక్కుతుండటం విశేషం. కృష్ణం రాజు, భాగ్యశ్రీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి పాత్రలకి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. రాధేశ్యామ్ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.

radhe-shyam-music-is-going-to-be-biggest-hit-planned-by-justin-prabhakaran
radhe-shyam-music-is-going-to-be-biggest-hit-planned-by-justin-prabhakaran

రాధేశ్యామ్ నుంచి ఇంతక ముందు వచ్చిన బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్.. ఇటీవల వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ ప్రభాస్ అభిమానులను .. ప్రేక్షకులను రికార్డ్ స్థాయిలో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న రాధేశ్యామ్ ప్రభాస్ దాదాపు 10 ఏళ్ళ తర్వాత నటిస్తున్న కంప్లీట్ రొమాంటిక్ లవ్ స్టోరీ. దాంతో దర్శకుడు రాధకృష్ణ ప్రభాస్ – పూజా హెగ్డే ల మీద అద్భుతమైన రొమాంటిక్ సీన్స్ ని తెరకెక్కించినట్టు సమాచారం. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 30 న ప్రపంచ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Radhe shyam : రాధే శ్యామ్ ఆల్బమ్ ఇండియాలోనే బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అవుతుందంటున్న మేకర్స్..!

కాగా తాజా రాధేశ్యామ్ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. రాధేశ్యామ్ ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలవబోతోందట. ఈ సినిమాలోని సాంగ్స్ కి .. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ అద్భుతంగా ఇస్తున్నాడట. సాంగ్స్ ఒక్కోటి ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. లవ్ స్టోరీ కాబట్టి ఆ ఫీల్ మొత్తం సాంగ్స్ లో ఉంటుందని .. రాధేశ్యామ్ సాంగ్స్ గురించి కొన్నేళ్ళ పాటు మాట్లాడుకుంటారని చెప్పుకుంటున్నారు. ఓవరాల్ గా రాధే శ్యామ్ ఆల్బమ్ ఇండియాలోనే బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అవుతుందని మేకర్స్ కూడా ధీమాగా చెబుతున్నారు.

Advertisement