Radhe Shyam: గండికోట‌లో రాధే శ్యామ్ చిత్ర షూటింగ్.. అఘోరాలు క‌నిపించ‌డంతో రెట్టింపైన అంచ‌నాలు

Radhe Shyam: రెబల్ స్టార్ కృష్ణంరాజు న‌ట‌ వారసుడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టిన ప్రభాస్ ఈశ్వ‌ర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఒక్కో సినిమాలో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తూ ప్రేక్ష‌కుల‌ని అలరిస్తున్న ప్ర‌భాస్..బాహుబ‌లి సినిమాతో ప్యాన్ ఇండియ‌న్ స్టార్‌గా మారాడు. బాహుబలి అనంతరం ప్రభాస్ తన మార్కెట్ ను మరింత విస్తరిస్తూ.. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.


Radhe Shyam Movie Expectations Has been Rised With Aghoras Seen during Shooting
Radhe Shyam Movie Expectations Has been Rised With Aghoras Seen during Shooting

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్.. సాహో అనే చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో చేశాడు.ఈ చిత్రం హిందీలో మంచి హిట్టైన కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌లేక‌పోయింది. ఇప్పుడు రాధే శ్యామ్ అనే చిత్రంతో పాటు స‌లార్, ఆది పురుష్‌, ప్రాజెక్ట్ కె అనే సినిమాలు చేస్తున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ సినిమా స్టోరీ ఒక రియల్ స్టోరీ నుంచి తీసుకున్నారనే టాక్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది.


Radhe Shyam Movie Expectations Has been Rised With Aghoras Seen during Shooting
Radhe Shyam Movie Expectations Has been Rised With Aghoras Seen during Shooting

యూర‌ప్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ప్రేమ‌క‌థ అని తెలుస్తుండ‌గా, ఈ చిత్రం పాత జ్ఞాపకాల‌ని గుర్తు చేస్తుంద‌ట‌. ఆదిత్య 369 లో టైం మిషన్ ఎక్కగానే విజయనగర సామ్రాజ్యానికి వెళ్లినట్లు .. రాధే శ్యామ్ కూడా గుహలోకి వెళ్ళగానే 1979 లోకి వెళ్తారన్నమాట . పీరియాడిక‌ల్ మూవీగా రాధాకృష్ణ చిత్రాన్ని అత్య‌ద్భుతంగా తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది. రాధేశ్యామ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా జమ్మలమడుగు గండికోట పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటుంది.


Radhe Shyam Movie Expectations Has been Rised With Aghoras Seen during Shooting
Radhe Shyam Movie Expectations Has been Rised With Aghoras Seen during Shooting

కోటలోని మాధవరాయ స్వామి దేవాలయం.. కోట ముఖ ద్వారం వద్ద సాంగ్ షూటింగ్ మొదలైంది. వేద పండితుల మధ్య ఈ సాంగ్ షూటింగ్ జరగగా.. ఇందులో ప్రభాస్, పూజాహెగ్డేతో పాటు మరో ముఖ్య నటుడు సత్యరాజ్ కూడా పాల్గొన్నాడు.స‌త్య‌రాజ్‌ వేదపాఠశాలలో గురువుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీన్స్ లో అఘోరాలు కూడా కనిపిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.