Radhe Shyam: బాబోయ్ .. రాధే శ్యామ్ కోసం అన్ని కోట్ల వ‌డ్డీలు చెల్లించారా..!

Tech Sai Chandu - October 30, 2021 / 08:37 PM IST

Radhe Shyam: బాబోయ్ .. రాధే శ్యామ్ కోసం అన్ని కోట్ల వ‌డ్డీలు చెల్లించారా..!

Radhe Shyam: బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తున్న మ‌రో భారీ బ‌డ్జెట్ చిత్రం రాధే శ్యామ్. ఇది గొప్ప ప్రేమ‌క‌థ గా మెష‌న్ పోస్ట‌ర్ ద్వారా రివీల్ అయ్యింది. విక్ర‌మాదిత్య ఎలా వుండ‌బోతున్నాడు..? ఏం చేయ‌బోతున్నాడు?. విక్ర‌మాదిత్య ఎవ‌రు..? అనే ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానం గా రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా క్యారెక్ట‌ర్ టీజ‌ర్ విడుద‌ల చేశారు.

ఇందులో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్య గా కనిపించనున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇట‌లీ లో జ‌రిగే ప్రేమ‌క‌థ గా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు దర్శకుడు కె కె రాధాకృష్ణ కుమార్. టీజ‌ర్ విడుద‌ల కాగా, 24 గంటలు కూడా కాకముందే ఈ టీజర్ 36 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. తెలుగులో ఫాస్టెస్ట్ వ్యూస్ దక్కించుకున్న టీజర్ గా నిలిచింది రాధేశ్యామ్.

ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో వెరీయేషన్ చూపించారు. ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ డార్లింగ్ ని సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేశారు. దీనికి జస్టిన్ ప్రభాకర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి.

కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్ తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణ గా నిలిచింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణ గా పుజా హెగ్డే కనిపించనున్నారు.

ఈ చిత్రం రెండు కరోనా దశలు చూసిన సినిమా. ఎప్పటికి అయినా విడుదల అవుతుందా? అని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేసిన సినిమా. అలాంటి సినిమా మరో రెండు మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం మూడు వందల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారని వార్తలు వున్నాయి. ఎంత స్వంత పెట్టుబడి, ఎంత ఫైనాన్స్ అన్న వివరాలు తెలియవు కానీ యువి సంస్థ కేవలం రాధేశ్యామ్ సినిమా ఫైనాన్స్ మీద యాభై నుంచి అరవై కోట్లు వడ్డీలకు చెల్లించినట్లు తెలుస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us