RADHE SHYAM: ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాకు అనుకోని తిప్పలు.. ప్ర‌త్యామ్నాయం కోసం ఎదురు చూపులు!

Samsthi 2210 - May 6, 2021 / 07:52 PM IST

RADHE SHYAM: ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాకు అనుకోని తిప్పలు.. ప్ర‌త్యామ్నాయం కోసం ఎదురు చూపులు!

ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులోనూ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు. అన్నింటికీ మించి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ సినిమాలంటే ఇప్పుడు మామూలు సబ్జెక్ట్స్ లేవు.. అన్నీ విజువల్ ఎఫెక్ట్స్ చుట్టూ తిరుగుతున్నాయి. బాహుబలి, సాహో లాంటి సినిమాలు కూడా భారీ విఎఫ్ఎక్స్ తోనే వచ్చాయి. ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాలోనూ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. ఒకవేళ కరోనా కానీ లేకపోయుంటే ఈ పాటికే సినిమా పూర్తై ఉండేది. సినిమాను కూడా జులై 30న విడుదల చేయాలని అనౌన్స్ చేసారు కూడా. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమా వాయిదా పడటం లాంఛనం అయిపోయింది.

Beats Of Radhe Shyam 1200

ఈ సినిమాను 70ల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. నాటి కాలం కథ కావడంతో దానికి తగ్గట్లుగా కొన్ని భారీ సెట్స్ కూడా వేశారు. దాంతో పాటు సీజీ కూడా ఎక్కువగానే ఉండబోతుంది ఈ సినిమాలో. ఈ సీజీ పనులు చాలా కంపెనీల చేతుల్లో పెట్టారు. అయితే ఒకే కంపెనీకి పనులన్నీ ఇస్తే ఆలస్యం అవుతుందని.. నాలుగైదు కంపెనీల మీద ఆధారపడ్డారు రాధే శ్యామ్ టీమ్. అయితే అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్లుంది ఇప్పుడు రాధే శ్యామ్ పరిస్థితి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఒక్క వర్క్ కూడా సరిగ్గా జరగడం లేదని.. అనుకున్న సమయానికి గ్రాఫికల్ వర్క్ పూర్తవడం కూడా కష్టమే అని తెలుస్తుంది.

పైగా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఆయా కంపెనీలు ఔట్ పుట్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతుంది. ఇది రిలీజ్ డేట్ పై బాగానే ఎఫెక్ట్ చూపించేలా కనిపిస్తుంది. దాంతో రాధే శ్యామ్ టీమ్ ప్రత్యామ్నాయల కోసం వెతుకుతుంది. కరోనా కారణంగా చాలా కంపెనీలలో ఉద్యోగులు కనీసం ఆఫీసుల వైపు కూడా రావడం లేదు. ఇంటి దగ్గర్నుంచి ఎంత చేసినా కూడా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతి రాధే శ్యామ్ కు వర్కవుట్ కావడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే సినిమా విడుదల 2021లో ఉండటం కూడా కష్టంగానే కనిపిస్తుంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us