Balakrishna : బాలయ్య సినిమాలో బాలనటిగా.. హీరోయిన్ గా చేసిన ఏకైక హీరోయిన్‌ ఎవరో తెలుసా..?

NQ Staff - March 6, 2023 / 01:30 PM IST

Balakrishna : బాలయ్య సినిమాలో బాలనటిగా.. హీరోయిన్ గా చేసిన ఏకైక హీరోయిన్‌ ఎవరో తెలుసా..?

Balakrishna : బాలయ్య ప్రస్తుతం ఈ వయసులో కూడా వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే వందకు పైగా సినిమాల్లో నటించిన ఆయన.. ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించాడు. ఆయన కెరీర్ లో చాలామంది బాలనటులు కూడా హీరోయిన్లుగా చూపించిన ఘనత కేవలం బాలయ్యకు మాత్రమే సొంతం.

అప్పట్లో బాలయ్య– కోడి రామకృష్ణ కాంబినేషన్‌ సూపర్ హిట్ గా ఉండేది. వీరిద్దరి కాంబోలో 1989లో వచ్చిన సూపర్ హిట్ సినిమా బాల గోపాలుడు. ఇందులో కల్యాణ్‌ రామ్పి బాల కళాకారుడిగా నటించాడు. అలాగే ఒకప్పటి హీరోయిన్ రాశి కూడా ఇందులో లక్ష్మీ అనే బాలనటి పాత్రలో నటించింది.

మూవీ డిజాస్టర్..

Raasi Acted As Heroine Opposite Balakrishna In Movie Krishna Babu

Raasi Acted As Heroine Opposite Balakrishna In Movie Krishna Babu

ఆమె ఈ సినిమాతోనే తొలిసారి తెలుగులో బాలనటిగా మెరిసింది. ఆ తర్వాత పెద్దయ్యాక హీరోయిన్ కూడా చేసింది. ఇక బాలయ్య పక్కన బాలనటిగా నటించిన  ఆమె.. ఆ తర్వాత కృష్ణ బాబు అనే సినిమాలో బాలయ్యకు జోడీగా హీరోయిన్ గా చేసింది. కానీ ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలి పోయింది.

ఇలా బాలయ్య కెరీర్ లో బాల నటిగా, ఆ తర్వాత హీరోయిన్ గా చేసిన ఏకైక హీరోయిన్ రాశి మాత్రమే. అంతుకు ముందు సీనియర్ ఎన్టీఆర్‌ హాయంలో కూడా శ్రీదేవి ఆయన సినిమాలో బాలనటిగా చేసి ఆ తర్వాత ఆయన పక్కనే హీరోయిన్ గా కూడా చేసింది. ప్రస్తుతం రాశి సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పాత్రల కోసం ప్రయత్నిస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us