Rashi khanna: ఆహా రాశీ ఖ‌న్నా.. ఏమందం ఇది, పిచ్చెక్కిస్తున్నావుగా..!

Rashi khanna: ఊహాలు గుస‌గుస‌లాడే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన రాశీ ఖ‌న్నా ప్ర‌స్తుతం తెలుగు, తమిళంలో బిజీగా హీరోయిన్‌గా మారింది. రాశీ ఖన్నా ఇప్పటికే హిందీలో రెండు వెబ్‌ సిరీస్‌లలో నటిస్తోన్న విషయం తెలిసిందే. వీటిలో ‘సన్నీ’ ఒకటి కాగా, మరొకటి అజయ్‌ దేవగన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘రుద్ర’.

raashikhanna gorgeous look4
raashikhanna gorgeous look4

ఇదిలా ఉంటే ఈ రెండు వెబ్‌ సిరీస్‌లు ఇంకా విడుదలవ్వక ముందే రాశీ ఖన్నా మరో లక్కీ ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ బడా నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. సిద్ధార్థ్‌ మల్హోత్రా, దిశా పటానీ లీడ్‌ రోల్‌లో నటిస్తోన్న ఈ సినిమాకు ‘యోధ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

raashikhanna gorgeous look3
raashikhanna gorgeous look3

పుష్కర్‌ ఓజా అనే కొత్త డైరెక్టర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీని నటింపజేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే మాత్రం రాశీ ఖన్నాకు బాలీవుడ్‌లో బ్రేక్‌ వచ్చినట్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

raashikhanna gorgeous look1
raashikhanna gorgeous look1

ఇదిలా ఉంటే రాశీ ప్రస్తుతం తెలుగులో గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘పక్కా కమర్షియల్‌’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’తో పాటు తమిళంలో కార్తీ సరసన ‘సర్దార్‌’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే బిజీ షెడ్యూల్ వ‌ల‌న రాశీ ఖ‌న్నా ముంబై టూ హైద‌రాబాద్ తిర‌గాల్సి వ‌స్తుంది.

raashikhanna gorgeous look
raashikhanna gorgeous look

ఈ ఉరుకుల పరుగుల జీవితం.. ఒక ఎయిర్ పోర్ట్ నుంచి మరో ఎయిర్ పోర్ట్‌కు వెళ్తున్నాను.. గోవాకు వెళ్తున్నాను అని రాశీ ఖన్నా ఇటీవ‌ల పేర్కొంది. ఈ మధ్యే రాశీ ఖన్నా తనలోని కామెడీ యాంగిల్‌ను మరోసారి చూపించింది. గోపీచంద్ మారుతి కాంబినేషన్‌లో రాబోతోన్న పక్కా కమర్షియల్ సినిమాతో మరోసారి నవ్వించేందుకు సిద్ధంగా ఉంది.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త లుక్స్‌లో క‌నిపిస్తూ థ్రిల్ చేస్తుంటుంది. తాజాగా ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లోను గ్లామ‌ర్ ఆర‌బోస్తూ కేక పెట్టిస్తుంది. రాశీ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.