Raashi Khanna: రాశీ ఖ‌న్నా ఇంత‌లా రెచ్చిపోయిందేంటి.. ప‌రువాలు మొత్తం ఆర‌బోసిందిగా..!

Raashi Khanna: అందాల ముద్దుగుమ్మ‌లు కొంద‌రు చాపకింద నీరులా అవ‌కాశాలు అందిపుచ్చుకుంటున్నారు. తమన్నా, కాజల్‌, పూజా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దదేనని చెప్పాలి. అయితే తాజాగా ఈ జాబితాలో అందాల తార రాశీ ఖన్నా వచ్చి చేరారు. తెలుగు, తమిళంలో బిజీగా హీరోయిన్‌గా మారిన తర్వాత రాశీ ఖన్నా తన టార్గెట్‌ను బీటౌన్‌కు మార్చింది.

Raashi Khanna Latest Photoshoot
Raashi Khanna Latest Photoshoot

రాశీ ఖన్నా ఇప్పటికే హిందీలో రెండు వెబ్‌ సిరీస్‌లలో నటిస్తోన్న విషయం తెలిసిందే. వీటిలో ‘సన్నీ’ ఒకటి కాగా, మరొకటి అజయ్‌ దేవగన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘రుద్ర’. ఇక‌బాలీవుడ్‌ బడా నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. సిద్ధార్థ్‌ మల్హోత్రా, దిశా పటానీ లీడ్‌ రోల్‌లో నటిస్తోన్న ఈ సినిమాకు ‘యోధ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో రాశీని తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌.

Raashi Khanna Latest Photoshoot
Raashi Khanna Latest Photoshoot

రాశీ ప్రస్తుతం తెలుగులో గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘పక్కా కమర్షియల్‌’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’తో పాటు తమిళంలో కార్తీ సరసన ‘సర్దార్‌’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న రాశీ ఖ‌న్నా మ‌రోవైపు అందాల ఆర‌బోత‌లోను ఏ మాత్రం త‌గ్గడం లేదు.

Raashi Khanna Latest Photoshoot
Raashi Khanna Latest Photoshoot

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై హీరోయిన్ రాశి ఖన్నా అద్భుత ప్రదర్శన ఇచ్చారు. తన అందచందాలతో పాటు ఆకట్టుకునే డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఈ ఈవెంట్ కోసం రెడ్ ట్రెండీ వేర్ ధరించారు . చోళీ లో క్లీవేజ్ అందాలు, బాటమ్ లో నడుము సోయగాలు చూపిస్తూ మెస్మరైజ్ చేశారు.

Raashi Khanna Latest Photoshoot
Raashi Khanna Latest Photoshoot

ఇక ఈ వేదికపై ప్రదర్శన ఇవ్వడం తనకు దక్కిన అదృష్టంగా రాశి ఖన్నా భావిస్తున్నారు. తన ఫీలింగ్ ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. సౌత్ చిత్ర పరిశ్రమను iffi లో రిప్రెజెంట్ చేయడం గౌరవం ఆమె భావిస్తున్నారు. రాశి ఖన్నా లేటెస్ట్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.

ఈ వేడుకలో సల్మాన్ పాల్గొనగా , ఆయనతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఊహలు గుసగుసలాడే మూవీతో రాశి ఖన్నా పూర్తి స్థాయి హీరోయిన్ గా మారారు. దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఊహలు గుసగుసలాడే.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నాగ శౌర్య హీరోగా నటించగా రాశి ఖన్నా పాత్ర బాగా ఆకట్టుకుంది.