R Narayana Murthy: ఆర్ నారాయ‌ణ మూర్తి ఆర్ధిక ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉందా ?

R Narayana Murthy: ఆర్ నారాయ‌ణ‌మూర్తి.. ఈ పేరుకి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త‌న సినిమాల‌తో ఎంతో మంది ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన నారాయ‌ణ‌మూర్తి ఎందరో మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. ఎంత ఎదిగిన ఒదిగే ఉండే మ‌న‌స్త‌త్వం ఆయ‌న‌ది. స్వ‌లాభం కోసం కాకుండా న‌లుగురి కోసం ఏదైన చేయాల‌నే వ్య‌క్తిత్వం నారాయణ మూర్తిది. హైద‌రాబాద్‌లో రోడ్డుపై న‌డుచుకుంటూ సామాన్యుడిలా వెళ‌తున్న నారాయ‌ణ మూర్తిని త‌న అభిమానులు ఎవ‌రైన కారులో ఎక్కించుకొని తీసుకెళ‌తా అన్నా కూడా అంగీక‌రించ‌డు.

ఈ రోజుల్లో అంద‌రు పేరు కోస‌మో, డ‌బ్బు కోస‌మో తీస్తుంటారు. కాని నారాయ‌ణ మూర్తి అలా కాదు. ప్ర‌జ‌ల‌లో చైత‌న్యం తీసుకొచ్చేందుకు చేస్తుంటారు. తాజాగా ఆయ‌న రైతుల క‌ష్టాల‌ని చూసి రైత‌న్న అనే సినిమా చేశారు. ఆర్ నారాయణమూర్తి దర్శకత్వం వహించి నటించిన ‘‘రైతన్న’’ సినిమా ప్రీ రిలీజ్ మీట్ ఆదివారం ఎల్వీ ప్ర‌సాద్ ల్యాబ్‌లో జరిగింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చెయ్యాలి. దేశానికి రైతే వెన్నెముఖ అంటారు. కానీ అన్నదాత ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? అనే కథాంశంతో ‘రైతన్న’ సినిమా తీశా అన్నారు నారాయ‌ణ మూర్తి.

“రైతన్న” సినిమా ప్రీ రిలీజ్ మీట్ కు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ప్రజా గాయకుడు గద్దర్, వామపక్ష నేత చాడ వెంకట రెడ్డి, కాంగ్రెస్ నేత కొందండ రెడ్డి, న్యూ డెమోక్రసీ నేత గోవర్ధన్, రైతు సంఘము నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ ‘‘రైతన్న’’ సినిమా కార్పొరేట్ సిస్ట‌మ్‌ని.. ప్రభుత్వాన్ని.. పాలకులను ప్రశ్నించే లాగా ఉందన్నారు.

నారాయణ మూర్తికి సోకులు నచ్చవు. ఆయ‌నకు ఇళ్లు లేదు.. భార్య లేదు..సోకు లేదు, బోటు లేదు. తాను నమ్మిన సిద్ధాతం కోసమే బతుకుతున్నాడని ఆయన తెలిపారు. ఎక్క‌డున్న‌వు, ఏం చేస్తున్నావు అని అడుగుతా చెప్ప‌డు. సొంత ఆస్థి లేని వ్య‌క్తి నారాయ‌ణ మూర్తి.

హైద‌రాబాద్‌లో ఇంటి కిరాయి క‌ట్ట‌లేక 50 కిమీ దూరం పోయి ఎక్క‌డో కిరాయి ఇంటిలో నివ‌సిస్తున్నారు. మా ద‌గ్గ‌ర ఉండ‌మ‌ని చెప్పిన విన‌డు. నారాయణమూర్తి సమాజ హితం తప్ప ఏమి కోరుకోడు. న‌మ్మిన సిద్ధాంతం కోసం త‌ప్ప మ‌రే దాని కోసం నారాయ‌ణ‌మూర్తి వెంప‌ర్లాడ‌డు అంటూ గ‌ద్ద‌ర్ స్ప‌ష్టం చేశారు. నారాయ‌ణ మూర్తి గురించి గ‌ద్ద‌ర్ చెప్పిన మాట‌లు విని ఆయ‌న అభిమానులు ఎమోష‌న‌ల్ అవుతున్నారు.