ANAND DEVARAKONDA: తమ్ముడికి విజయ్ దేవరకొండ సాయం.. ఫస్ట్ లుక్‌లో అదరగొట్టిన ఆనంద్ దేవరకొండ
Samsthi 2210 - March 1, 2021 / 11:16 AM IST

ఇండస్ట్రీకి వారసుల తాకిడి ఏ మాత్రం తగ్గడం లేదు. కొడుకులు,కూతుళ్ళు, తమ్ముళ్ళు ఇలా స్టార్స్ బంధువులు వెండితెరపై వినోదం పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ దేవరకొండ మంచి హిట్స్ కొడుతూ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న విజయ్ తన తమ్ముడి విజయానికి కావలసినంత సాయం చేస్తున్నాడు.
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ చిత్రంతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇందులో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ప్రేక్షకులని అలరించడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు సాధించింది. ఇప్పుడు రెండో సినిమాగా మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే టైటిల్‌తో సినిమా చేశారు ఆనంద్. వినోద్ అనంతోజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. దీంతో తన మూడో సినిమాను కూడా ఇప్పటికే మొదలు పెట్టాడు. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ని విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఇది ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా మూవీకి పుష్పక విమానం అనే టైటిల్ పెట్టినట్టు అర్దమైంది. పోస్టర్‌లో ఆనంద్ దేవరకొండతో పాటు ఇద్దరు హీరోయిన్స్ శాన్వి మేఘన, గీత సైనీ,సునీల్, సీనియర్ నరేష్ ఉన్నారు. డార్క్ కామెడీగా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. పొట్టచెక్కలయ్యేలా ఈ సినిమాతో నవ్వించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. దామోదర అనే కొత్త దర్శకుడు చెప్పిన స్టోరీ ఆనంద్ దేవరకొండకు నచ్చడంతో ఇప్పుడు ఆయనతో సినిమా చేస్తున్నాడు. విజయ్ మట్టపల్లి .. ప్రదీప్ ఎర్రబెల్లి ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గతంలో వచ్చిన పుష్పక విమానం అనే టైటిల్‌తో వచ్చిన సినిమా భారీ విజయం సాధించడంతో ఇప్పుడు అదే టైటిల్‌తో వస్తున్న మూవీ కూడా సినీ ప్రేక్షకులని అలరిస్తుందని అంటున్నారు.