PUSHPA: స‌రికొత్త రికార్డ్ న‌మోదు చేసిన పుష్ప‌.. అత్యంత వేగంగా 60 మిలియన్ మైలురాయి

లెక్క‌ల మాస్టారు సుకుమార్ రంగ‌స్థ‌లం చిత్రం నుండి ఫుల్ ఫాంలోకి వ‌చ్చాడు. రామ్ చ‌ర‌ణ్ హీరోగా రంగ‌స్థ‌లం అనే చిత్రాన్ని తెర‌కెక్కించిన సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు అలాంటి వైవిధ్య‌మైన చిత్రాన్ని మ‌రో మెగా హీరోతో చేస్తున్నాడు. బ‌న్నీ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పుష్ప చిత్రం గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది. క‌రోనా వ‌ల‌న చిత్ర షూటింగ్‌కు అంత‌రాయం క‌లుగుతుంది.ఆగ‌స్ట్ 13న చిత్రాన్ని విడుద‌ల చేస్తార‌ని మేక‌ర్స్ కొద్ది రోజుల క్రితం ప్ర‌క‌టించిన‌, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ని చూస్తుంటే ఆ స‌మ‌యానికి మూవీ విడుద‌ల కావ‌డం క‌ష్ట‌మే అనిపిస్తుంది.

అల వైకుంఠపురముంలో తర్వాత అల్లు అర్జున్ కు తెలుగు ఇండస్ట్రీలో పెరిగిన మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్టార్‌గా మారేందుకు ప్ర‌య‌త్నిస్తున్న బ‌న్నీ పుష్ప‌తో ప‌లు రికార్డుల‌ను నమోదు చేస్తున్నాడు. ఇటీవ‌ల పుష్ప చిత్రానికి సంబంధించిన ఇంట్ర‌డ‌క్ష‌న్ వీడియో ఒక‌టి విడుద‌ల చేయ‌గా, తెలుగు ఇండస్ట్రీ లో అత్యంత వేగంగా 60 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్న తొలి ఇంట్రడక్షన్ వీడియో గా నిలిచి చరిత్ర సృష్టించింది. దీనికి 1.4 మిల్లియన్ లైకులతో పాటు లక్ష పైన కామెంట్స్ కూడా రావడం విశేషం. రష్మిక మందన హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సంచలన దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Advertisement