Pushpa: ట్రైల‌ర్‌కు ముందు శాంపిల్ వ‌దిలిన పుష్ప టీం.. బ‌న్నీ అభిమానుల‌కి పూన‌కాలు..!

Pushpa:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మందాన ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం పుష్ప‌. యావత్‌ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబరు 6న ట్రైల‌ర్‌ని అందించనున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఆ హంగామా ఎలా ఉంటుందో ‘ట్రైలర్‌ టీజ్‌’ పేరుతో రుచి చూపించింది.

pushpa-trailer sample released
pushpa-trailer sample released

26 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో.. సినిమాలోని కీలక పాత్రల్ని, థీమ్‌ని పరిచయం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ దృశ్యాలన్నీ అత్యంత వేగంగా సాగుతాయి. ఈ సినిమాలో ఎవరెవరు ఏ పాత్ర పోషించారో చూడాలనుకుంటే మాత్రం ట్రైలర్‌ టీజ్‌ చూసేటప్పుడు యూట్యూబ్‌ ప్లే సెట్టింగ్స్‌లో స్పీడ్‌ను 0.25Xకు తగ్గించుకుంటే ‘పుష్ప’ అసలు ప్రపంచం కనపడుతుంది.

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. రష్మిక కథానాయిక. సునీల్‌, ఫాహద్‌ ఫాజిల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డిసెంబరు 17న ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

pushpa-trailer sample released2
pushpa-trailer sample released2

మొదటిసారి ఈ సినిమాలో బన్నీ పూర్తిగా ఢీగ్లామర్ లుక్‏తో కనిపించబోతుండడంతో పుష్ప పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న మొదటి భాగాన్ని పుల భాష‌ల‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా.. అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విలన్ గా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తుండగా.. అనసూయ, సునీల్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ పాటలు ప్రేక్షకులను విపరీతంగా కట్టుకున్నాయి. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ను దక్కించుకుంటున్నాయి ఈ సాంగ్స్.