Pushpa: హిందీలో అద‌ర‌గొడుతున్న పుష్ప‌.. భారీ ఎత్తున సీక్వెల్ విడుద‌ల చేసే ప్లాన్

Pushpa: పుష్ప‌..పుష్ప రాజ్ ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదు. డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంది పుష్ప.

pushpa recoed break in hindi
pushpa recoed break in hindi

భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం సహా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డును సృష్టిస్తోంది. సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ కు చేరగా.. గ‌త‌ ఏడాది (2021) అత్యధిక కలెక్షన్స్ సాధించిన తొలి మూవీగా ‘పుష్ప ది రైజ్’ నిలిచింది.

అయితే కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆంక్షలున్నాయి. ముఖ్యంగా హిందీ మార్కెట్లో థియేటర్లు ఎక్కువగా మూతవేయడం సహా కొన్ని చోట్ల 50 శాతం సామర్థ్యంతో సినిమాలను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ‘పుష్ప’ హిందీ వర్షెన్ కు రూ.75కోట్లకు పైగా కలెక్షన్లు రావడం సరికొత్త రికార్డు అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

పుష్ప చిత్రం హిందీలో పెద్ద‌గా ప్రమోష‌న్స్ చేసుకోలేదు. చివరి నిమిషంలో అడ్డంకులు ఏర్ప‌డ‌డం, ప‌రిమిత సంఖ్య‌లో సినిమాని విడుద‌ల చేసిన కూడా పుష్ప చిత్రం మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ రెస్పాన్స్ ని బ‌ట్టి పుష్ప 2 చిత్రాన్ని భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌నున్నార‌ట‌. కేజీఎఫ్ 2 క‌న్నా భారీగా పుష్ప‌2 రిలీజ్ ఉంటుంద‌ని స‌మాచారం.

pushpa recoed break in hindi1
pushpa recoed break in hindi1

అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి రూ. 101.85 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి విడుదలైంది. ఇక హిందీలో రూ. 10 కోట్ల బిజినెస్ చేసింది.

రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 14.15 కోట్ల ధర పలికింది. ప్రపంచవ్యాప్తంగా అయితే రూ. 144.90 కోట్ల బిజినెస్ చేసింది. మిగతా చోట్ల సంగతి ఎలా ఉన్నా హిందీ బయ్యర్లు మాత్రం భలే లాభాలు వెనకేసుకుంటున్నారు.