Pushpa Raj : కూతురితో అల్లు అర్జున్ సరదా ఆట.! ఓడిపోయిన పుష్ప రాజ్.!
NQ Staff - September 20, 2022 / 11:23 AM IST

Pushpa Raj : స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వెండితెరపై పుష్పరాజ్‌గా ‘పుష్ప’ సినిమాలో ఎలా చెలరేగిపోయాడో చూశాం. ఇంట్లో కూతురు అర్హ ముందు మాత్రం ఇంకా చిన్న పిల్లాడైపోతుంటాడు. గతంలో పలు వీడియోలు షేర్ చేశాడు కుమార్తె అర్హకి సంబంధించి అల్లు అర్జున్. తాజాగా అల్లు అర్హకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అయ్యింది.

Pushpa Raj Allu Arjun Allu Arha Game
ఆ వీడియోలో అల్లు అర్జున్ కుమార్తె అర్హ క్యూటు క్యూటుగా ‘గంగి గోవు పాలు గరిటడైన చాలు..’ అంటూ చెప్పేసింది. తన కుమార్తె అలా మాట్లాడుతోంటే మురిసిపోయాడు స్టైలిష్ ఐకాన్ స్టార్. ఓడిపోయిన అల్లు అర్జున్.. ‘7 తెల్ల లారీలు.. ఏడు నల్ల లారీలు.. ఇది నువ్వు స్పీడుగా తప్పు లేకుండా చెప్పు..’ అంటూ తన తండ్రి అల్లు అర్జున్‌కి సవాల్ విసిరింది అర్హ.
అల్లు అర్జున్ నెమ్మదిగా చెప్పాడు. ‘నువ్వు ఓడిపోయావ్ డాడీ..’ అంటూ అల్లు అర్హ నవ్వేసింది. సాధారణంగా సెలబ్రిటీల పిల్లలు తెలుగులో మాట్లాడటం చాలా అరుదు. మాట్లాడినా, వారి మాటల్లో తెలుగు కంటే టెల్గు ఎక్కువగా కనిపిస్తుంటుంది. అల్లు అర్హ మాత్రం.. అచ్చంగా తెలుగు మాట్లాడుతోంది.
అదీ ముద్దు ముద్దుగా. అందుకే ఈ వీడియో అంత ముచ్చటగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, అవుతోంది కూడా.!
అల్లు అర్జున్ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘పుష్ప ది రూల్’ పనుల్లో బిజీగా వున్న విషయం విదితమే.