Pushpa: ఏయ్ బిడ్డా, ఇది నీ అడ్డా అంటూ అదిరిపోయే స్టెప్పులు వేసిన బ‌న్నీ

Pushpa: క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్‌ 1.. ‘పుష్ప ది రైజ్’ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

pushpa one more song release1
pushpa one more song release1

సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌ వేగం పెంచారు మేకర్స్‌.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన దాక్కో దక్కో మేక’, ‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే’ ‘సామీ సామీ’ పాటలు యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నాయి.తాజాగా ఈ పుష్ప నుంచి నాలుగో పాటను విడుదల చేసింది చిత్ర బృందం.

‘ఏ బిడ్డ ఇది నా అడ్డ‌’అంటూ ఈ పాట సాగుతుంది. ఈ సాంగ్‌లో అల్లు అర్జున్‌ గుబురు గ‌డ్డం, పొడ‌వైన జుట్టుతో ఎర్ర‌టి నిలువు బొట్టుతో ఊర మాస్‌ లుక్‌లో కనిపించారు. దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించారు. మంచి మాస్ సాంగ్‌గా ఇది ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. సమంత ఈ చిత్రంలో స్పెషల్‌సాంగ్‌లో కనిపింనుండటం సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.

పాన్‌ ఇండియా సినిమా కావడంతో ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు కన్నడలోనే విడుదల చేస్తున్నారు. ఇక పుష్పను హిందీలో గోల్డ్ మైన్స్ కంపెనీ విడుదల చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించగా… తమిళంలో లైకా ప్రోడక్షన్స్ భారీగా విడుదల చేయబోతోంది.

అల్లు అర్జున్ అల వైకుంఠ పురములో ఈ సినిమాతో బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మొదటిసారి రెండు వందల కోట్ల బిజినెస్ మార్కును చేరుకోవడంతో అల్లు అర్జున్ కు ఎంతో సంతోషంగా ఉన్నాడు. అయితే తదుపరి సినిమా కూడా అంతకు మించి అనేలా ఉండాలి అని పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.