Pushpa : పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం స‌రికొత్త స్కెచ్‌తో వ‌స్తున్న సుకుమార్

Pushpa : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రం పుష్ప‌. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నాడు.

TheNewsQube-
pushpa movie pre release event plans
pushpa movie pre release event plans

గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ, ఏ బిడ్డ ఇది నా అడ్డా అనే పాటలు ప్రేక్షకులను విపరీతంగా కట్టుకున్నాయి. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ను దక్కించుకుంటున్నాయి ఈ సాంగ్స్ .

pushpa movie pre release event plans
pushpa movie pre release event plans

ఈ పాన్ ఇండియా సినిమాను డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారట సుక్కు. డిసెంబర్ 17వ తేదీకి సరిగ్గా 5 రోజుల ముందు అంటే డిసెంబర్ 12న ఈ గ్రాండ్ ఈవెంట్‌ నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా పలువురు టాప్ స్టార్స్‌ని గెస్టులుగా ఆహ్వానిస్తున్నారట సుకుమార్.

పక్కాగా స్కెచ్చేసి రంగంలోకి దూకుతున్న ఆయన, పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ మునుపెన్నడూ చూడనంత గ్రాండ్‌గా జరగాలని భావిస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో బలమైన కథను ‘పుష్ప’ పేరుతో రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొత్తం 5 భాషల్లో రిలీజ్ కానుండటం విశేషం.

ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ మొదటివారంలో దుబాయ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం చివరి సాంగ్ ను షూట్ చేస్తున్నారట. ఈ సినిమా స్పెషల్ సాంగ్ లో సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. దేవీ శ్రీ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు .