Pushpa : ‘పుష్ప’ ఐటెం సాంగ్ విషయంలో పూజా, దిశా లలో ఎవరో తేల్చుకోలేకపోతున్న సుకుమార్..?

Pushpa : ‘పుష్ప’..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం. పాన్ ఇండియన్ స్థాయిలో సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా రిలీజయ్యే దీనిలో మరొక హీరోయిన్ పార్ట్ 2లో ఉండబోతుందనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వకీల్ సాబ్ సినిమాతో ఫాంలోకి వచ్చిన నివేథా థామస్ సెకండ్ హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కానీ ఇంకా మేకర్స్ నుంచి క్లారిటీ రాలేదు.

pushpa-item song who is the actress pooja or disha
pushpa-item song who is the actress pooja or disha

అయితే ఇందులో ఉన్న ఐటెం సాంగ్ కోసం సుకుమార్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడని చెప్పుకుంటున్నారు. పాన్ సినిమా..తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి పాన్ ఇండియన్ స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోయిన్‌తో ఐటెం సాంగ్ చేయిస్తే సినిమాకు బాగా ప్లస్ అవుతుందనేది చిత్ర బృందం ఆలోచన. ఈ కారణంగా స్టార్ హీరోయిన్..అది కూడా బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న భామనే తీసుకోవాలని డిసైడయ్యారట.

Pushpa : ‘పుష్ప’ పార్ట్ 1 ఈ ఏడాది రిలీజ్ చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు.

ఆ భామ ఎవరనేది ఫైనల్ కాలేదు. కాగా పూజా హెగ్డే, దిశా పటాని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరు అనే విషయంలో తర్జన భర్జన పడుతున్నారట. ఈ ఇద్దరికి అటు హందీలో ఇటు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. మరి ఎవరిని పుష్పలో ఐటెం సాంగ్ కోసం తీసుకుంటారో చూడాలి. వీరితో పాటు సనమ్ రే ఫేం ఊర్వశీ రౌతెలా పేరూ పరిశీలిస్తున్నారట. ఈ హాట్ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం తెలుగులో బ్లాక్ రోజ్ అనే సినిమా చేసింది. కాగా పుష్ప పార్ట్ 1 ఈ ఏడాది రిలీజ్ చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు.