PUSHPA స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ త్వరలో పుష్ప అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పుష్ప సినిమాను సుకుమార్ తెరకెక్కించగా, ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. కరోనా వలన దాదాపు 9 నెలలు షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప ఫస్ట్ మీట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మేకర్స్. చాలా గ్రాండ్‌గా జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగానే హాజరయ్యారు. అయితే పుష్పరాజ్ ఫస్ట్ మీట్ అంటూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంకు సంబంధించి అన్‌సీన్ విజువల్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో బన్నీ ఉత్సాహంగా కనిపిస్తున్న విజువల్స్ ఆయన గ్రాండ్ ఎంట్రీకు సంబంధించిన కొన్ని విజువల్స్ చూపించారు. ఇవి ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌గా ఉంది. ఆర్య, ఆర్య2 చిత్రం తర్వాత సుకుమార్- బన్నీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి.