pushpa: సినిమా ఇండస్ట్రీని పైరసీతో పాటు లీకేజ్‌లు ఎంతగా బాధిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం వకీల్ సాబ్‌కు చెందిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రంకు కూడా లీకుల బెడద తప్పలేదు. తాజాగా పుష్ప షూటింగ్ లొకేషన్‌కు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా, ఇది చూసిన నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘పుష్ప’ మూవీ ఆగస్ట్ 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం వరకు తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లిలో షూటింగ్ జరుపుకోగా, ఇప్పుడు ఖమ్మంలో మోతుగూడెంలో జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ ప్రజలు లొకేషన్ వద్దకు చేరుకొని బన్నీ బన్నీ అంటూ కేకలు వేశారు. వారందరిని ఆప్యాయంగా పలకరించాడు స్టైలిష్ట్ స్టార్. ఇందుకు సంబంధించిన వీడియో కూడా రీసెంట్గా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.

తాజాగా పుష్ప మేకర్స్ ఓ సాంగ్‌ని చిత్రీకరిస్తుండగా, ఇది ఓ నది ఒడ్డున చిత్రీకరించబడినట్టు లీకేజ్ వీడియోని చూస్తుంటే అర్దమవుతుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేస్తుండగా, మూవీకి సంబంధించి ఇలా లీకులు చేయడాన్ని నిర్మాతలు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తుండగా.. ఆయన సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బన్నీ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.