Pushpa : పుష్ప .. ‘ ఆ రిలీజ్ డేట్ ‘ మాకు వద్దంటే వద్దు – గోల గోల చేస్తోన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ !

Pushpa : పుష్ప .. అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా. లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ సినిమాలన్ని సెట్స్ మీదకి వచ్చాయి. వరసగా షూటింగ్స్ తో స్టార్ హీరోలందరూ బిజీగా ఉంటున్నారు. మళ్ళీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయి. ఈ ఏడాది సంక్రాంతి సీజన్ లో నాలుగు సినిమాలు విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టి మేకర్స్ లో నమ్మకం కలిగించాయి. ముఖ్యంగా మాస్ మహారాజ రవితేజ క్రాక్ సినిమా ఇండస్ట్రీకి నమ్మకాన్ని తెచ్చింది. దాంతో ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సినిమాలకు సంబంధించి దర్శక నిర్మాతలు రిలీజ్ డేట్స్ ని ఇప్పడే లాక్ చేసి పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పెద్ద హీరోలు కూడా తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు.

pushpa-allu-arjun-fans-rejects-the-release-date-of-pushpa-movie
pushpa-allu-arjun-fans-rejects-the-release-date-of-pushpa-movie

ఇందులో భాగంగానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన పుష్ప సినిమా విడుదల తేదీని తాజాగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు. పోస్టర్ తోం కూడుకున్న అల్లు అర్జున్ లుక్  పుష్ప రిలీజ్ డేట్ ఆగస్ట్ 13న ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 5 భాషల్లో భారీగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మన్య ప్రాంతం మారేడిమిల్లి ఫారెస్ట్ లో పుష్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.కాగా తాజాగా చిత్రబృందం ప్రకటించిన రిలీజ్ డేట్ పై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయట.

Pushpa : అల్లు అర్జున్ అభిమానులు కంగారు పడుతున్నారట..?

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం ఆదివారం వచ్చింది. కాబట్టి హోలీ డే ఎఫెక్ట్ ఉండదు. అదీకాక తెలుగు తప్ప ప్రతీ భాషలో సహజంగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పెద్ద సినిమాలు విడుదల ఖచ్చితంగా ఉంటుంది. అల్లు అర్జున్ మొట్ట మొదటి పాన్-ఇండియా చిత్రం కాంపిటీషన్ లో విడుదల అవ్వడం మంచి ఆలోచన కాదాన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. అంతేకాదు పాన్ ఇండియా ఎడ్వాంటేజ్ నష్టపోతారు అని అల్లు అర్జున్ అభిమానులు కంగారు పడుతున్నారట. మరి పుష్ప సినిమా విడుదలయ్యాక ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా అల్లు అర్జున్ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement