Poorna: పూర్ణ ఏంది అలా రెచ్చిపోయింది.. ఏకంగా అతడి బుగ్గ కొరికేసిందిగా..!

Poorna: బుల్లితెర పాపుల‌ర్ షోస్‌లో ఢీ ఒక‌టి. ఈ కార్య‌క్ర‌మం చాలా ఫేమ‌స్ అయింది. కొన్ని సంవ‌త్స‌రాలుగా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న ఈ కార్య‌క్రమంలో కంటెస్టెంట్స్, జ‌డ్జెస్ మారుతూ వ‌స్తున్నారు. అయిన‌ప్ప‌టికీ రేటింగ్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఢీ షోలో ఒక‌వైపు కామెడీ పంచుతూనే మ‌రోవైపు డ్యాన్స్‌తో ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. ఈ షోకి ప్ర‌దీప్ యాంక‌రింగ్, సుధీర్, ఆదిల పంచ్‌లు, ప్రియ‌మ‌ణి, పూర్ణ‌ల సంద‌డి స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మారింది.

బుల్లితెర షోస్ కూడా ఇప్పుడు రేటింగ్స్ అనేక రూట్స్‌లో ప‌య‌నిస్తున్నాయి. ఇందులో యాంకర్స్ అందాల ఆర‌బోస్తే కంటెస్టెంట్స్ శృతి మించిన డైలాగ్స్ వ‌ద‌ల‌డం, జ‌డ్జెస్ ముద్దుల‌తో ర‌చ్చ చేయ‌డం కామ‌న్‌గా జ‌రుగుతూ వ‌స్తుంది. తాజాగా ఢీ షోకి జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న పూర్ణ ఏకంగా ఓ డ్యాన్స‌ర్ బుగ్గ కొరుకుతూ రెచ్చిపోయింది.

వ‌చ్చేవారం ప్రసారం కానున్న ఢీ షోకి సంబంధించి తాజాగా ప్రోమో విడుద‌ల చేశారు.ఇందులో యాంక‌ర్స్, టీమ్ లీడ‌ర్స్, కంటెస్టెంట్స్ సంద‌డి బాగానే ఉంది. ఎప్ప‌టిలానే సుధీర్, ఆది, ప్ర‌దీప్ త‌మ పంచ్‌ల‌తో సంద‌డి చేశారు. ఇక కంటెస్టెంట్స్ సైతం డ్యాన్స్‌ల‌తో అద‌ర‌గొట్టారు. ఓ డ్యాన్స‌ర్ బేబి గెట‌ప్‌లోకి మారి ‘మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు’ అనే పాటతో పర్ఫామెన్స్ చేశాడు.

ఆ పాట‌లో డ్యాన్స‌ర్ ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌కి పూర్ణ ఫిదా అయింది. పాట మొత్తం ఆయ‌న‌పై ప్రేమ బాణాలు విసురుతుంది. చివ‌ర‌కు అత‌ని ద‌గ్గ‌ర‌కు వెళ్లి బుగ్గ‌లు కొరింది. ఇది చూసి అక్క‌డ ఉన్న జ‌డ్జెస్,కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. నెటిజ‌న్స్ అయితే ఆమెపై విమ‌ర్శ‌నాస్త్రాలు కురిపిస్తున్నారు. మేనేజ‌ర్స్ ఇచ్చే డ‌బ్బుల కోసం ఇలా కొర‌క‌డాలు మొద‌లు పెట్టారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పూర్ణ ఢీ షో చేస్తూనే `తలైవి`, `సుందరి`, `బ్యాక్‌ డోర్‌` వంటి సినిమాలతోపాటు `నవరస` వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తుంది.