Puri Jagannath: దంప‌తులు విడాకుల వ‌ర‌కు వెళ్ల‌కుండా పూరీ ఇచ్చిన స‌ల‌హా ఏంటో తెలుసా?

Puri Jagannath: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల జీవితాల‌ని అనేక ర‌కాలుగా చిన్నాభిన్నం చేస్తుంది. కరోనా వ‌ల‌న లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో చాలా మంది తిండి తిప్ప‌లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొంద‌రికి ఉపాధి లేక‌పోవ‌డంతో పూట గ‌డవ‌డం క‌ష్టంగా మారింది. ఇక కొంద‌రేమో విడాకుల బాట ప‌డుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితులు చూసి చ‌లించిపోతున్నారు.

Puri Jagannath Advice on Divorce
Puri Jagannath Advice on Divorce

తెలుగు ఇండ‌స్ట్రీలో డాషింగ్ డైరెక్ట‌ర్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న పూరీ జ‌గన్నాథ్ పూరీ మ్యూజింగ్స్ పేరుతో ప్ర‌జ‌ల‌లో ధైర్యం నింపుతున్నాడు. ప్ర‌తి రోజు ప‌లు విష‌యాల గురించి చ‌ర్చిస్తూ ధైర్యం నూరిపోస్తున్నాడు. తాజ‌గా విడాకుల విష‌యంపై త‌న స్పంద‌న తెలియ‌జేశాడు.

లాక్ డౌన్ సమయంలో అమెరికా, చైనా లాంటి చోట విపరీతంగా విడాకులయ్యాయి. భారతదేశంలో కొంచెం తక్కువే అయినా ఈ లాక్ డౌన్ లో ఎక్కువ విడాకుల కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు పూరి. అయితే విడాకులకి ప‌రిష్కారం కూడా చెప్పిన పూరీ.. పెళ్లికి ముందు కొన్ని రూల్స్ పెట్టాలంటున్నాడు. స్త్రీ- పురుషులకు రెండేళ్ల పని అనుభవం లేకుండా వివాహాన్ని అనుమతించకూడదు. అప్పుడే అనవసరమైన వివాహాలు తప్పవు. ఒంట‌రిగా ఉండ‌లేక కొంద‌రు పెళ్లి చేసుకుంటారు. అలాంటి పెళ్లి త‌ర్వాత కూడా ఒంట‌రిగానే ఉంటారు.

లాక్‌డౌన్ స‌మ‌యంలో దంప‌తులు విడాకుల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే భార్య‌,భ‌ర్త‌లు ఇద్ద‌రు కొంత దూరంగా ఉండాలి. 30 నిమిషాల క‌న్నా ఎక్కువ మాట్లాడ‌కూడదు. ఖాళీ స‌మ‌యాన్ని స్నేహితుల‌తో మాట్లాడండి, టీవీ చూడండి, ఇత‌ర ప‌నుల‌తో బిజీగా ఉండండి. ఇలా చేస్తే మీ దాంప‌త్యాన్ని కాపాడుకోగ‌ల‌రు. వివాహాలు ఫెయిల్ అవ్వ‌డానికి కూడా భారీ అంచ‌నాలు ఉండ‌డం కార‌ణంగా చెప్పుకోవ‌చ్చని ప‌లు సూచ‌న‌లు చేశాడు పూరీ. ఆయ‌న కామెంట్స్ ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి.

ఇక పూరీ సినిమాల విష‌యానికి వ‌స్తే విజ‌య దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లో లైగ‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. . ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి క‌నిపించ‌నున్న‌ట్టు టాక్. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.