Puri jagannaadh : పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ లో కృతిశెట్టి..?

Puri jagannaadh : పూరి జగన్నాధ్ .. గతంలో వైష్ణో అకాడమి అన్న బ్యానర్ లో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. అయితే ఎందుకనో ఆ బ్యానర్ లో పూరి జగన్నాధ్ ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. ప్రస్తుతం పూరి కనెక్ట్స్ – పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి కలిసి సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ పూరి జగన్నాధ్ టీం ఫుల్ ఫాం లోకి వచ్చేసింది. వరసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆకాష్ పూరి హీరోగా మూడవ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం.

puri-jagannaadh-krithi-shetty-is-in-puri-jagannadhs-touring-talkies
puri-jagannaadh-krithi-shetty-is-in-puri-jagannadhs-touring-talkies

ఇప్పటికే ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. ఈ సినిమాకి పూరి జగన్నాధ్ కథ, మాటలతో పాటు నిర్మాణం మాత్రమే చేస్తున్నాడు. ఆయన అసోసియేట్ అనిల్ పాదూరి దర్శకుడిగా రొమాంటిక్ సినిమా తో పరిచయం అవుతున్నాడు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా ఆకాష్ రొమాంటిక్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కథ పూరి మార్క్ లవ్ అండ్ రొమాన్స్ తో పాటు మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారట. కాగా త్వరలో రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారట చిత్ర యూనిట్. అంతేకాదు ‘రొమాంటిక్’ ఎంటర్‌టైనర్ ని ఫిబ్రవరి 14 న రిలీజ్ చేసేందుకు పూరి – చార్మి సన్నాహాలు చేస్తున్నారట.

Puri jagannaadh : లాక్ డౌన్ లో స్టార్ హీరోలతో పాటు కొడుకు ఆకాష్ కోసం కూడా ఒక కథ సిద్దం చేసిన పూరి జగన్నాధ్..?

కాగా పూరి కనెక్ట్స్ – పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి కలిసి ఆకాష్ తో మూడవ సినిమాని నిర్మిచేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ లో స్టార్ హీరోలతో పాటు కొడుకు ఆకాష్ కోసం కూడా ఒక కథ సిద్దం చేశాడట పూరి. ఈ కథ తోనే ఆకాష్ మూడవ సినిమా తెరకెక్కనుందట.
పూరి దగ్గర అసోసియేట్ గా చేస్తున్న కొత్త కుర్రాడిని దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడట. కాగా ఈ సినిమాలో ఆకాష్ కి జంటగా ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కృతిశెట్టి ని హీరోయిన్ గా తీసుకోవాలని పూరి టీం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కృతిశెట్టి చేతిలో నాని, సుధీర్ బాబు సినిమాలున్నాయి.

Advertisement