Pawan kalyan: పవన్ కళ్యాణ్ కోసం తన పేరునే త్యాగం చేసిన టాప్ హీరో

Pawan kalyan: ప‌వ‌ర్ స్టార్.. ఈ పేరు వింటే అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. ప‌వ‌ర్ స్టార్ అంటే అభిమానులు అంద‌రికి ఒకే ఒక్క స్టార్ గుర్తొస్తుంటారు. మ‌రి ఆయ‌న ఎవ‌రో మీ అంద‌రికి తెలిసే ఉంటుంది. ప‌వ‌ర్ స్టార్ అనే సౌండ్ వినిపిస్తే అంద‌రు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే అంటారు. ఎంద‌రో ప‌వ‌ర్ స్టార్ అని ముందు ట్యాగ్ లైన్స్ ఇచ్చుకున్నా కూడా అస‌లైన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని ఆయన అభిమానులు గ‌ర్వంగా చెప్పుకుంటూ ఉంటారు.

Pawan kalyan

పవ‌న్ క‌ళ్యాణ్ త‌న అన్న‌య్య స్పూర్తితో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌గా, ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ త‌న‌కంటూ స‌ప‌రేట్ ఐడెంటిటీ ఏర్పాటు చేసేకున్నారు. సినిమాల్లో ఆయన చేసిన రియల్ స్టంట్స్.. పవర్ స్టార్ అనే బిరుదును తెచ్చిపెట్టాయి. తొలి సినిమాలోనే చేతుల మీదనుంచి కార్లు పోనిచ్చుకోవడం.. గుండెలపై బండలు పగల గొట్టించుకోవడం వంటి స్టంట్స్ తో మెస్మరైజ్ చేశారు ప‌వ‌న్. అస‌లు సిస‌లైన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సర్టిఫై చేశారు.

క‌న్న‌డ కంఠీర‌వ రాజ్ కుమార్ త‌నయుడు పునీత్ రాజ్ కుమార్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా శాండ‌ల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోగా స‌త్తా చాటుతున్నాడు. ఏకంగా జాతీయ అవార్డును కూడా దక్కించుకున్నాడు. పూరీ జగన్నాథ్ ‘ఇడియట్’ రీమేక్ తో కన్నడ నాట స్టార్ హీరో అయిపోయాడు. ఈ చిత్రం అక్కడ కూడా దుమ్ములేపడంతో పునీత్ తిరుగులేని స్టార్ అయ్యాడు. ఆయ‌న చేసిన ప‌వ‌ర్ ఫుల్ రోల్స్ పునీత్‌కు ప‌వ‌ర్ స్టార్ అనే బిరుదుని తీసుకొచ్చి పెట్టాయి.

అభిమానులు ప‌వ‌ర్ స్టార్ అని పిలుచుకోవ‌డంతో మేక‌ర్స్ కూడా వెండితెర‌పై కూడా ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అని టైటిల్స్ వేయ‌డం ప్రారంభించారు. అయితే తాజాగా పునీత్ రాజ్‌కుమార్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పవర్ స్టార్’ అంటే పవన్ కల్యాణ్ గారు మాత్రమేనని అని, ఇక మీదట తనను పవర్ స్టార్ అని పిలవొద్దంటూ.. పవన్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు.

‘‘పవన్ కల్యాణ్ సార్ ను నేను చాలా సార్లు కలిశాను. ఆయన ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతారు. ఆయనకు అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ఉంది. అందుకే పవర్ స్టార్ అయ్యారు’’ అని కొనియాడారు. ప్ర‌స్తుతం పునీత్ రాజ్‌కుమార్ కి చెందిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.