Puneeth raj kumar: పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీకి జిమ్ గండం.. ఎందుకలా జరుగుతుంది..!
NQ Staff - October 30, 2021 / 11:14 AM IST

Puneeth raj kumar: శాండల్ వుడ్ నటుడు పునీత్ రాజ్ కుమార్ గుండె నొప్పితో బాధపడుతూ శుక్రవారం (అక్టోబర్ 29)న తుది శ్వాస విడిచారు. పునీత్ మరణంతో శాండల్ వుడ్ మాత్రమే కాదు.. యావత్ సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పునీత్ తో తమ బంధాన్ని అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు నటీనటులు విలపిస్తున్నారు.

puneeth raj kumar family struggle with gym2,jpg
అయితే సినీ సెలబ్రిటీలు పర్ఫెక్ట్ ఫిజిక్ కోసం యెగా, వ్యాయామం వంటివి చేస్తూ ఉంటారు. పునీత్ జిమ్‌లో ఎక్కువగా కష్టపడేవాడు. మంచి ఫిజిక్‌ను సాధించాలనే ఆసక్తే ఆయన్ను పూర్తి స్థాయి ఫిట్నెస్ లవర్‌గా మార్చింది. జిమ్ వర్కవుట్‌తో పాటు క్రాస్ ఫిట్, మార్షల్ ఆర్ట్స్, యోగా వంటివి కూడా ప్రతిరోజూ తప్పనిసరిగా సాధన చేసేవారు.
లాక్డౌన్ టైమ్‌లో వీలైనన్ని వ్యాయామాలు చేసినా 2 నుంచి 3 కిలోలు బరువు పెరిగానని, లాక్డౌన్ ఎత్తేయగానే తిరిగి షేప్ సాధించడం కోసం ఎదురు చూస్తున్నానని పునీత్ ఆ మధ్య అన్నారు. ఆయన ఎక్కువ సమయం జిమ్‌లోనే గడుపుతూ ఉంటారట.
ఫిట్నెస్ మీద ఇష్టంతో గంటల పాటు జిమ్‌లో గడిపారో అదే జిమ్‌లో గుండెపోటుకు గురి కావడం విషాదం. ఈ నేపథ్యంలో రాజ్‌కుమార్ కుటుంబానికి వ్యాయామశాల కలసి రాలేదనే చర్చ సాగుతోంది. గతంలో పునీత్ రెండో సోదరుడు రాఘవేంద్ర జిమ్ చేస్తుండగా పక్షవాతం వచ్చింది. అలాగే గతంలో శివ రాజ్‌కుమార్ కూడా జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా అస్వస్థతకు గురయ్యారు.
పునీత్ రాజ్ కుమార్ గురువారం రాత్రి బెంగళూరులో మ్యూజిక్ డైరెక్టర్ గురుకిరణ్ పుట్టిన రోజు వేడుక్కి హాజరయ్యారు. ఈ వేడుకలో సుమారు రెండు గంటలకు పైగా బర్త్ డే పార్టీలో ఉన్నారని గురు కిరణ్ చెప్పారు. ఆయన చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారని, మాతో చాలా ఉత్సాహంగా గడిపారని తెల్లారే సరికి ఇలాంటి చేదు వార్త వినాల్సి వస్తుందనుకోలేదని ఆయన ఫ్రెండ్ అన్నారు.