బ్రేకింగ్ : పునర్నవి పెళ్ళికొడుకు ఇతనేనా ?
Admin - October 29, 2020 / 04:17 PM IST

బిగ్ బాస్ మూడవ సీజన్ లో సందడి చేసిన పునర్నవి అందరికి తెలిసిందే. అయితే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఆమె పిట్టగోడ, ఉయ్యాల జంపాల, మళ్లీమళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాల్లో నటించింది. కానీ బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది పునర్నవి. ముఖ్యంగా బిగ్ బాస్ లో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి ల మధ్య లవ్ ట్రాక్ నడిచింది. దీనితో బిగ్ బాస్ అయిపోయిన తరువాత ఈ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు కావొచ్చని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ మేము మంచి స్నేహితులం మాత్రమేనని వారు చెప్పుకొచ్చారు.
ఇక ఇది ఇలా ఉంటె తాజాగా పునర్నవి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసి హాట్ టాపిక్ గా మారింది. ‘చివరకు ఇలా జరుగుతుంది’ అని ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన చేయిని మరొకరి చేయి పట్టుకున్న ఒక ఫోటోను షేర్ చేసింది పునర్నవి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పునర్నవి చేతి వేలుకు ఒక డైమండ్ రింగ్ పెట్టుకొని ఉంది. దీనితో ఆమెకు ఎంగేజిమెంట్ అయిందని అభిమానులు భావిస్తున్నారు. అసలు పునర్నవిని పెళ్లి చేసుకోబోయేది ఎవరా అని అందరికి సందేహం ఉంది.
ఇక ఆ సందేశాన్ని ఎట్టకేలకు బయటపెట్టింది. అయితే కొద్దిసేపటి క్రితం మరోసారి పోస్ట్ పెట్టింది పునర్నవి. అయితే అతని పేరు ఉద్భవ్ రఘునందన్. ఇక అతను యాక్టర్, రైటర్, ఫిలిం మేకర్ అని తెలుస్తుంది. అసలు విషయంలోకి వెళితే ఉద్భవ్, పునర్నవి కలసి ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కోసమే పునర్నవి ఈ పోస్ట్ చేసిందని తెలుస్తుంది. అంతేకాని వీరిద్దరికి ఎలాంటి ఎంగేజిమెంట్ జరగలేదట. మొత్తానికి పునర్నవి ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చింది.