నగ్నంగా ఉన్న ఫోటో అడిగిన నెటిజన్.. అసభ్య సంజ్ఞతో పునర్నవి ఘాటు రిప్లై
NQ Staff - December 29, 2020 / 09:44 AM IST

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. హీరోయిన్లందరూ కూడా తమ ఫాలోవర్లు, అభిమానులతో ఆటలు ఆడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో కేవలం అభిమానులు మాత్రమే ఉండరు.. ఆకతాయిలు కూడా ఉంటారని మరిచిపోయారేమో. తాజాగా హీరోయిన్‌లు ఓకొత్త ట్రెండ్‌కు శ్రీకారంచుట్టారు. ఎలాంటి ఫోటోలు అడిగినా సరే షేర్ చేస్తామంటూ ఓ ఆట ఆడుతున్నారు. ఈక్రమంలో సమంత, కీర్తి సురేష్, ప్రణీత లు ఫ్యాన్స్‌కు బంపర్ఆఫర్ ఇచ్చారు.
ఈ ట్రెండ్‌లో సమంత రకరకాల ఫోటోలను షేర్ చేసింది. మొదటి ఫోటో షూట్, పెళ్లి నాటి ఫోటోలు ఇలా ఎన్నెన్నో షేర్ చేసింది. ఇక ప్రణీత అయితే ఏకంగా బాత్ టబ్ పిక్‌ను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. కీర్తి సురేష్ తన కాలేజ్ డేస్ నాటి ఫోటోలను షేర్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. తాజాగా పునర్నవి కూడా ఇదే బాటలో నడిచింది. ఆమె కూడా తన ఫాలోవర్లతో ఇలాంటి ఆటే ఆడింది.
కానీ పునర్నవి కి మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఎవరో ఓ ఆకతాయి.. నగ్నంగా ఉన్న ఫోటోను షేర్ చేయమని కోరాడు. దీంతో తిక్క రేగిను పునర్నవి.. మధ్యవేలును చూపిస్తూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఇక అలా చూపిస్తే దాని మీనింగ్ ఏంటన్నది అందరికీ తెలిసే ఉంటుంది.. ప్రత్యేకంగా విడమరిచి చెప్పాల్సిన అవసరమే లేదు. మొత్తానికి పునర్నవికి మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా నెగెటివిటీనే ఎదురువుతూ ఉంటుంది.