Punarnavi Bhupalam : పునర్నవి హెల్త్ అప్డేట్.! కోలుకుంటోందిట.! థ్యాంక్స్ కూడా చెప్పేసింది.!
NQ Staff - January 4, 2023 / 01:43 PM IST

Punarnavi Bhupalam : పునర్నవికి ఏమయ్యింది.? గ్లామర్ ప్రపంచానికి దూరంగా జరిగి, ఎక్కడో విదేశాల్లో చదువుకుంటోన్న సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం.. ఇటీవల తన ఇంట్లో ఓ వేడుక కోసం ఇండియాకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇండియాకి వచ్చాక, ఇక్కడి సంగతుల గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్టులు పెట్టింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు ఆమె పేర్కొనడంతో అంతా షాక్‌కి గురయ్యారు.
తీవ్ర అనారోగ్యమా.?
అయితే, తన ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చింది పునర్నవి. ప్రస్తుతం కొంత బాగానే వుందనీ, పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందనీ పునర్నవి తాజాగా ఓ పోస్ట్ చేసింది.
మీడియా తన గురించి రాస్తున్న వార్తలు చూస్తున్నానని పేర్కొన్న పునర్నవి మీడియాకి థ్యాంక్స్ కూడా చెప్పింది. అదే సమయంలో ‘బట్ నో థ్యాంక్స్.. ఇట్ ఫీల్స్ స్ట్రేంజ్’ అంటూ వ్యాఖ్యానించింది.
‘నా ఫేస్‌ని నేను న్యూస్ ఆర్టికల్స్, లోకల్ టీవీ ఛానళ్ళలో చూసుకుంటున్నా..’ అని పునర్నవి పేర్కొనడం గమనార్హం.