Punarnavi Bhupalam : పున్ను హెల్త్‌ ఇష్యూ… ఇదే చివరిది కావాలంటూ ఎమోషనల్‌ పోస్ట్‌

NQ Staff - January 3, 2023 / 10:11 PM IST

Punarnavi Bhupalam : పున్ను హెల్త్‌ ఇష్యూ… ఇదే చివరిది కావాలంటూ ఎమోషనల్‌ పోస్ట్‌

Punarnavi Bhupalam : తెలుగు ప్రేక్షకులకు ఉయ్యాల జంపాల చిత్రంతో పరిచయం అయిన పునర్నవి భూపాలం ఆ తర్వాత బిగ్బాస్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడి గురించి బాగా ప్రచారం జరిగింది.

పునర్నవి ఒక మంచి నటి అంటూ చాలా మంది అప్పటి నుండే అభిప్రాయం వ్యక్తం చేస్తూ వచ్చారు. బిగ్ బాస్ లో 77 రోజుల పాటు ఆమె కొనసాగింది. ఆ తర్వాత సినిమాల్లో వరుసగా ఆఫర్స్ దక్కించుకుంది.

ఒకటి రెండు వెబ్ సిరీస్ లో కూడా నటించింది. గత కొంత కాలంగా సినిమాలకు సిరీస్ లకు పూర్తిగా దూరం ఉంటున్న పునర్నవి తాజాగా చేసిన ఆసక్తికర ప్రకటన ఆమె అభిమానులకు షాకింగ్ గా ఉంది.

గత కొంత కాలంగా తాను ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాను అంది. నేను ఆనారోగ్యం బారిన పడడం ఇదే చివరిది కావాలని కోరుకుంటున్నాను అంటూ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసింది.

ప్రస్తుతం ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న పునర్నవి అతి త్వరలోనే దాని నుండి కోరుకుంటానని కూడా చెప్పుకొచ్చింది. ఆమె అనారోగ్య సమస్య తెలిసిన ఫ్యాన్స్ చాలా మంది సోషల్ మీడియా ద్వారా గెట్ వెల్ అంటూ మెసేజ్ పెట్టారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us