Punarnavi Bhupalam : హాట్ హాట్ ఫోజుల‌తో ర‌చ్చ చేసిన పున‌ర్న‌వి..!

Punarnavi Bhupalam : బిగ్ బాస్ షోతో అందరి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ పున‌ర్న‌వి. అప్పుడెప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయింది. అయితే, ఈ మధ్య పెద్దగా స్క్రీన్‌పై కనిపించడం లేదు. సోష‌ల్ మీడియాలోనే అప్పుడ‌ప్పుడు ర‌చ్చ చేస్తూ ఉంటుంది.

Punarnavi Bhupalam H0TTEST Workout
Punarnavi Bhupalam H0TTEST Workout

‘ఉయ్యాల జంపాల’ అనే సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది పునర్నవి భూపాలం. అందులో హీరోయిన్ పాత్రలో కనిపించి మెప్పించిన ఆమె.. ఆ తర్వాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘పిట్టగోడ’, ‘మనసుకు నచ్చింది’, ‘ఈ సినిమా సూపర్ హిట్’, ‘ఎందుకో ఏమో’ సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ ఆమెకు గుర్తింపు మాత్రం సొంతం కాలేదు.

కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా మరికొన్నింట్లో సపోర్టింగ్ రోల్స్‌లో నటించినప్పటికీ.. పునర్నవికి రావాల్సిన క్రేజ్ రాలేదు.బిగ్ బాస్ లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఊహించని స్థాయిలో ఫేమస్ అయిపోయింది. బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు పునర్నవి భూపాలం.. రాహుల్ సిప్లీగంజ్‌తో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వీళ్లిద్దరూ ప్రేమికుల్లా వ్యవహరిస్తూ ప్రేక్షకుల్లో ఎన్నో డౌట్లను క్రియేట్ చేశారు.

బిగ్ బాస్‌తో క్రేజ్ వచ్చినా పునర్నవి పెద్దగా అవకాశాలను అందుకోలేదు. అయితే, కొద్ది రోజుల క్రితం సినీ నటుడు రఘునందన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నానని చెబుతూ ఆమె సోషల్ మీడియాలో ఓ ఫొటోను వదిలి అందరినీ ఫూల్స్‌ను చేసేసిందీ బ్యూటీ. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలోనే ఎక్కువ‌గా సంద‌డి చేస్తుంది.

తాజాగా వ‌ర్క‌వుట్ వీడియో షేర్ చేస్తూ హాట్ హాట్ ఫోజులిచ్చింది అందాల ముద్దుగుమ్మ పున‌ర్న‌వి. ఈ అమ్మడు అందాల‌కు అంద‌రు మంత్ర‌ముగ్ధుల‌వుతున్నారు. చూస్తుంటే పున‌ర్నవి రానున్న రోజుల‌లో మ‌రింత ర‌చ్చ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.