పునర్నవి వెరైటీ వ్యాయామం.. పిక్ వైరల్

NQ Staff - January 12, 2021 / 11:32 AM IST

పునర్నవి వెరైటీ వ్యాయామం.. పిక్ వైరల్

బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం ఫిట్ నెస్ మీద ఎంత శ్రద్ద పెడుతుందో అందరికీ తెలిసిందే. సినిమాల ద్వారా పునర్నవికి వచ్చిన క్రేజ్ కంటే బిగ్ బాస్ షో ద్వారా ఆమెకు వచ్చిన పాపులార్టీయే ఎక్కువ. ఉయ్యాల జంపాల, పిట్టగోడ, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటిచిత్రాల్లో పునర్నవి నటన అందరినీ ఆకట్టుకుంది. ఆమెకంటూ ఓ మోస్తరుగా గుర్తింపు వచ్చింది. కానీ పునర్నవికి సరైన క్రేజ్ ఫాలోయింగ్ మాత్రం రాలేదు. కానీ బిగ్ బాస్ షో మాత్రం పునర్నవికి అన్నీ ఇచ్చింది.

punarnavi-bhupalam-doing-asanas

punarnavi-bhupalam-doing-asanas

బిగ్ బాస్ మూడో సీజన్‌లో రాహుల్ పునర్నవిది ఓ ట్రెండ్. బయటకు వచ్చాక ఈ ఇద్దరి మధ్య ఉన్న ట్రాక్, రిలేషన్ గురించి చాలా పెద్ద చర్చనే జరిగింది. ఈ ఇద్దరి గురించి వార్తలు రాని రోజంటూఉండేవి కాదు.అయితే పునర్నవి సోషల్ మీడియాలో ఎంత బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. బ్యూటీ టిప్స్, యోగాకు సంబంధించిన విషయాలను చెబుతూ తన ఫాలోవర్లలో స్ఫూర్తిని నింపుతూ ఉంటుంది. ఆ మధ్య తన యోగా ఫోటోల పై హాట్ అనే కామెంట్లు పెట్టి వార్తలు రాయడంతో ఎంత పెద్దగొడవ చేసిందో అందరికీ తెలిసిందే.

అలా సోషల్ మీడియాలో రెబల్‌గా పునర్నవి విరుచుకుపడుతుంది. ఈ మధ్యే వితిక షెరు సోదరి పెళ్లి వేడుకల్లో పునర్నవి రచ్చ రచ్చ చేసింది. తాజాగా పునర్నవి వెరైటీ వ్యాయామం చేసింది. చిన్నప్పుడు స్కూల్‌లో అల్లరి చేస్తే గోడ కుర్చీ వేయించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా అలానే పునర్నవి కూడా గోడ కుర్చీ వేసింది. మొత్తానికి పునర్నవి మాత్రం వెరైటీ వెరైటీ విన్యాసాలతో యోగాలు చేస్తూ అందరిలోనూ ఆరోగ్యం పట్ల స్ఫూర్తిని నింపుతూ ఉంటుంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us