నీ యేషాలు తగిలెయ్యా.. పునర్నవి పై నెటిజన్స్ ఫైర్

NQ Staff - October 30, 2020 / 03:17 PM IST

నీ యేషాలు తగిలెయ్యా.. పునర్నవి పై నెటిజన్స్ ఫైర్

పునర్నవి రెండు మూడు రోజుల నుంచి ఎంతగా హల్చల్ చేసిందో అందరికీ తెలిసిందే. మొత్తానికి ఇది జరిగిపోతోంది అంటూ ఎంగేజ్మెంట్ లాంటి బిల్డప్ ఇచ్చింది. అంతటితో ఆగిపోకుండా మరుసటి రోజు ఓ వ్యక్తి ఫోటోను షేర్ చేసి.. యస్ చెప్పాల్సి వచ్చింది మిగతా వివరాలు రేపు (అక్టోబర్ 30) చెబుతానని తెలిపింది. అంతేకాకుండా అవతలి వ్యక్తి కూడా ఓ రేంజ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి బాగానే జీవించారు.

Punarnavi Bhupalam

ఆమె యస్ చెప్పింది అంటూ ఉద్భవ్ రఘునందన్ అనే వ్యక్తి పున్నుతో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేశాడు. మామూలుగా అయితే ఇద్దరూ ఇక్కడే దొరికిపోయారు. ఉద్భవ్ అనే వాడు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడు. షార్ట్ ఫిలింలతో ఫేమస్ అయ్యాడు. అలాంటి వాడితో ఇలాంటివి అనే సరికి అందరికీ అనుమానం వచ్చింది. పెళ్లి కాదు గిల్లి కాదు.. ఏదైనా సినిమా ప్రమోషన్ అయి ఉంటుందని కొందరు భావించారు.

కానీ చాలా మంది మాత్రం పునర్నవి పెళ్లి అనే ఫిక్స్ అయ్యారు. కానీ అలాంటి వారికి పున్ను తాజాగా షాక్ ఇచ్చింది. తప్పక ఒప్పుకోవాల్సి వచ్చిందని అసలు సంగతి చెప్పింది. కమిట్‌మెంటల్ అనే వెబ్ సిరీస్ కోసం యస్ చెప్పాను అని తీరిగ్గా అసలు సంగతి చెప్పేసింది. దీంతో కొందరు నెటిజన్లు అవాక్కవ్వగా.. కొందరు మాత్రం ముందే పసిగట్టామని తెలిపారు. నీ యేషాలు తగిలెయ్యా.. ఈ పర్ఫామెన్స్ తెరపై చేసి ఉంటే మంది హీరోయిన్ అయ్యేదానివి అంటూ సెటైర్లు వేస్తున్నారు.

 

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us