Pujita Ponnada : వీకెండ్ ఫన్‌లో పూజితా పొన్నాడ.! పొట్టి గౌనులో బుట్టబొమ్మలా.!
NQ Staff - November 26, 2022 / 10:39 PM IST

Pujita Ponnada : విశాఖ పట్నం పోరీ పూజిత పొన్నాడకు గ్లామర్‌లో సెపరేట్ టేస్ట్ వుంది. ఆ టేస్ట్‌లో ముంబయ్ ముద్దుగుమ్మలకు ఏమాత్రం తీసిపోదీ అందాల భామ.
అయినా తెలుగమ్మాయ్ కదా.. కాస్త చులకనెక్కువ. అంతంత మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయ్. అయితే, మిగిలిన తెలుగమ్మాయిలతో పోల్చితే పూజిత పొన్నాడ కాస్త బెటర్ ఛాన్సులే దక్కించుకుంటోందని చెప్పొచ్చు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా ‘హరి హరవీరమల్లు’లో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది పూజిత పొన్నాడ. అలాగే, మాస్ రాజా రవితేజతో ‘రావణాసుర’ సినిమాలోనూ పూజిత నటిస్తోంది.
సో క్యూట్ అండ్ హాట్.. నో లిమిట్స్ సుమా..!
గతంలో కీర్తి సురేష్ నటించిన ‘మిస్ ఇండియా’ సినిమాలో అమ్మడు నెగిటివ్ షేడ్స్ వున్న రోల్ కూడా పోషించి, సపోర్టింగ్ రోల్స్ మాత్రమే కాదు, ఎలాంటి రోల్ అయినా హ్యాండిల్ చేయగలనని నటన పరంగా ప్రూవ్ చేసుకుంది పూజిత పొన్నాడ.
ఇక, అందాల విషయానికి వస్తే, ఆరబోతలో అస్సలు మొహమాటపడదు పాప. కథ డిమాండ్ చేస్తే, ఏ రేంజ్ గ్లామర్కైనా సిద్ధమే అంటుంది. తాజాగా సోషల్ మీడియాలో కుచ్చుల గౌనుతో హై హీల్స్ వేసుకుని, అదరిపోయే క్యూట్ పోజులిచ్చింది పూజిత.
అమ్మడి హాట్ అండ్ క్యూట్ పోజులకు కుర్రకారు ఫిదా అంటోంది. ఇంకెందుకాలస్యం.. ఈ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేస్కోండి.