Prudhvi Raj: క్ష‌మాప‌ణ‌లు చెప్పిన 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ.. ఎందుకో తెలుసా?

Prudhvi Raj: పృథ్వీ అంటే అంద‌రు గుర్తు ప‌ట్ట‌కపోవ‌చ్చు, 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ అంటే మాత్రం వెంట‌నే వెలుగుతుంది. వెండితెర‌పై కామెడీ పంచుతూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించే పృథ్వీ ఇటీవ‌లి కాలంలో అనేక వివాదాల‌లో నిలుస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నాడు.గ‌తంలో వైసీపీ తీర్థం పుచ్చుకుని ఎస్వీబీసీ చైర్మన్‌గా కీలక బాధ్యలు చేపట్టారు థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ. అయితే ఓ మహిళతో ఆడియో కాల్ ఇష్యూతో తన పదవిని పోగొట్టుకున్నారాయన‌.

Prudhvi Raj

అయితే త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం జ‌రిగిన‌ప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకున్నానంటూ పృథ్వీ అప్ప‌ట్లో పేర్కొన్నాడు. ఏడాదిన్నరగా తాగడం మానేశా.. కానీ నాపై వచ్చిన ఆరోపణలకు ఆ ముందులో పురుగుల మందు కలుపుకుని చనిపోదాం అనుకున్నా. ఆ మూడు నెలలు నరకం అనుభవించా. ఆ టైంలో కూడా మా కార్యకర్తలు ఎవరూ పలకరించలేదు. నేను పడ్డ క్షోభ నా శత్రువు కూడా పడకూడదు అని పృథ్వీ పేర్కొన్నాడు.

ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ సినిమాలు, షోస్‌తో బిజీగా ఉంటున్నాడు పృథ్వీ. అయితే రీసెంట్‌గా పృథ్వీ శ్రీదేవి డ్రామా కంపెనీలో గౌతం రాజు గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేశాడ‌ట‌. దీనిపై కొంద‌రు క‌మెడీయ‌న్ గౌతం రాజుని అంత మాట‌లు అంటావా అని అత‌నిపై ఫైర్ అయ్యార‌ట‌. దీంతో అక్క‌డ జ‌రిగిన విష‌యంపై వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చాడు పృథ్వీ.

శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ నేను చూడ‌ని కూడా చూడ‌లేదు. స్పాంటేనియ‌స్‌గా గౌతం రాజు అనే నా ఫ్రెండ్ గురించి అన్నాం. కాని కొంద‌రు ఆర్టిస్ట్ గౌతం రాజు అని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. మేమంద‌రం మంచి ఫ్రెండ్స్. పొర‌పాటు జ‌రిగింది. దీనిని ఎవ‌రు చిల‌వ‌లు ప‌ల‌వ‌లు చేయ‌కండి అని పృథ్వీ పేర్కొన్నారు.