Godfather : ‘గాడ్ ఫాదర్’.. ఆ నిశ్శబ్దం వెనుక ఈ విస్ఫోటనం.!

NQ Staff - October 5, 2022 / 10:26 PM IST

Godfather : ‘గాడ్ ఫాదర్’.. ఆ నిశ్శబ్దం వెనుక ఈ విస్ఫోటనం.!

Godfather : మెగాస్టార్ చిరంజీవి తన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ ప్రమోషన్ల సమయంలో ‘నిశ్శబ్ధ విస్ఫోటనం’ అనే మాట అరుదుగానే అయినా వాడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఎందుకు చిరంజీవి అలా అన్నారు..?

నిజానికి, ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రమోషన్లు అంత గొప్పగా ఏం జరగలేదు. చిరంజీవి తలచుకుంటే సల్మాన్ ఖాన్‌ని హైద్రాబాద్‌కి రప్పించి, ఓ ప్రెస్ మీట్ పెట్టి వుండేవారే. ఆయనకు ఆ స్టామినా వుంది. చిరంజీవి అడిగితే, సల్మాన్ ఖాన్ రాకుండా వుంటాడా.? కానీ, అలా జరగలేదు.

ఆ సైలెన్స్ వెనుక అసలు కథ ఇదీ..

‘ఆచార్య’పై భారీ అంచనాలు, ఆ సినిమాని దెబ్బతీశాయ్. అందుకే, చిరంజీవి మాత్రం వున్నంతలో సినిమా ప్రమోషన్లు ‘మమ’ అనిపించారు. సత్యదేవ్ కూడా అంతే. నయనతార ఎటూ సినిమా పబ్లిసిటీ కోసం రాదు. నిజానికి, ఆమె వచ్చేందుకు సిద్ధమేనని చెప్పిందట గానీ.. కొంచెం తటపటాయించిందట ‘గాడ్ ఫాదర్’ టీమ్.

హైప్ తగ్గించుకుంటూ రావడం ‘గాడ్ ఫాదర్’ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యిందని ఇప్పుడంతా అంటున్నారు. ప్రమోషన్లు సరిగ్గా చేయలేదంటూ అప్పట్లో హర్ట్ అయిన అభిమానులు, ఇప్పుడు ఆ వ్యూహమే కరెక్ట్ అయ్యిందంటూ మెగాస్టార్ చిరంజీవిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

‘సింగిల్ హ్యాండ్‌గా ఈ క్రెడిట్ అంతా నీదే మెగాస్టారూ..’ అంటూ అభిమానులు మెగాస్టార్ చిరంజీవిని ఆకాశానికెత్తేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us