Project K Deepika Padukone Released First Look : ప్రాజెక్ట్ కే నుంచి దీపికా పదుకొణె ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఎలా ఉందంటే..?

NQ Staff - July 18, 2023 / 10:43 AM IST

Project K Deepika Padukone Released First Look : ప్రాజెక్ట్ కే నుంచి దీపికా పదుకొణె ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఎలా ఉందంటే..?

Project K Deepika Padukone Released First Look :

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రాజెక్ట్ కేసినిమా గురించే చర్చ జరుగుతోంది. అసలు ఇది ఏ రకమైన సినిమా అనేది అందరిలో ఆశ్చర్యాన్ని నింపుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ కూడా నటిస్తున్నారు.

ఇంత పెద్దస్టార్లు ఒకే సినిమాలో కనిపిస్తుండటంతో అంచనాలు పీక్స్ కు వెళ్లిపోయాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక తాజాగా దీపికా పదుకొణె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో ఆమె దుప్పటి కప్పుకున్నట్టు కనిపిస్తోంది. పైగా ఆమె లుక్స్ ఏదో చూస్తున్నట్టు ఉంది.

Project K Deepika Padukone Released First Look

Project K Deepika Padukone Released First Look

ప్రభాస్ లుక్ వచ్చే ఛాన్స్..

దాంతో అనేక ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇక ఈ నెల 20వ తేదీన మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను వదలబోతున్నారు. శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ మూవీ టీమ్ పాల్గొనబోతోంది. ఈ వేడుకలోనే మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను వదలబోతున్నారు. ఇందులో ప్రభాస్ లుక్ కనిపించే అవకాశాలు ఉన్నాయి.

Project K Deepika Padukone Released First Look

Project K Deepika Padukone Released First Look

అంతే కాకుండా అమితాబ్ బచ్చన్ లుక్ కూడా కనిపించనుందని తెలుస్తోంది. దాని కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ గా రాబోతోంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో దీన్ని తీస్తున్నారు. ఇదిపాన్ వరల్డ్ మూవీగా రాబోతున్నట్టు తెలుస్తోంది. మరి రిలీజ్ కు ముందే ఇంతటి భారీ అంచనాలు పెంచుతున్న ఈ సినిమా.. ఇంక ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us